Bihar hooch tragedy
Bihar hooch tragedy: బిహార్ లోని ఛప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 39కి పెరిగింది. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. బిహార్ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. యథేచ్ఛగా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినందుకుగాను ఛప్రా ప్రాంత స్టేషన్ హౌస్ ఆఫీసర్, వివేక్ తివారీని అధికారులు సస్పెండ్ చేశారు.
కల్తీ మద్యం ఘటనపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై పోలీసులు, అధికారులతో ఆయన మాట్లాడారు. బిహార్ లో మద్య నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా మద్యం తయారు చేసి అమ్ముతూ వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు.
మద్యం తాగకూడదంటూ బిహార్ మంత్రి ఎస్కే మహాసేత్ నిన్న ప్రజలను కోరారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉందని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2016, ఏప్రిల్ నుంచి బిహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వం మద్యనిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పట్లో ఒక్కసారిగా మద్యం దొరకకపోవడంతో మందుబాబులు వింతగా ప్రవర్తించారు. కొందరు సబ్బులు తింటూ, కొందరు హానికర పదార్థాలు తాగుతూ అనారోగ్యానికి గురయ్యారు.
Shraddha Murder Case: ఆ శరీర భాగాలు శ్రద్దా మృతదేహానివే.. డీఎన్‌ఏ రిపోర్టులో స్పష్టత