Shraddha Murder Case: ఆ శరీర భాగాలు శ్రద్దా మృతదేహానివే.. డీఎన్‌ఏ రిపోర్టులో స్పష్టత

శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆప్తాబ్ చెప్పినట్లుగా గురుగ్రామ్‌లో దొరికిన శరీర భాగాలు శ్రద్ధా మృతదేహానివా? కాదా అనే విషయం తెలుసుకొనేందుకు సీఎఫ్‌ఎస్ఎల్ ల్యాబ్‌కు ఢిల్లీ పోలీసులు పంపించారు. వీటితో పాటు, శ్రద్ధా తండ్రి నమూనాలను డీఎన్ఏ పరీక్షకోసం తీసుకున్నారు. తాజాగా వాటి రిపోర్టులు వచ్చాయి...

Shraddha Murder Case: ఆ శరీర భాగాలు శ్రద్దా మృతదేహానివే.. డీఎన్‌ఏ రిపోర్టులో స్పష్టత

Shraddha Murder Case

Shraddha Murder Case: ఢిల్లీలో శ్రద్ధా హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. నిందితుడు శ్రద్ధాను హత్యచేసి ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కట్ చేసి పలు ప్రదేశాల్లో పడేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు నిందితుడు, శ్రద్ధాతో సహజీవనం చేసిన వ్యక్తి ఆప్తాబ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్తాబ్ చెప్పిన వివరాల ప్రకారం.. మెహ్రౌలీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఎముకల రూపంలో మృతదేహానికి సంబంధించి పలు భాగాలను పోలీసులు గుర్తించారు. వీటిలో మానవ దవడ ఎముక కూడా లభించింది.

Shraddha Murder Case : శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడిపై కత్తులతో దాడికి యత్నం

నిందితుడు చెప్పినట్లుగా ఆ ఎముకలు శ్రద్ధా మృతదేహానివా? కాదా అనే విషయం తెలుసుకొనేందుకు సీఎఫ్‌ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించారు. వీటితో పాటు శ్రద్ధా తండ్రి నమూనాలను డీఎన్ఏ పరీక్షకోసం తీసుకున్నారు. తాజాగా వాటి రిపోర్టులు వచ్చాయి. అడవిలో దొరికిన ఎముకలతో శ్రద్ధ తండ్రి డీఎన్ఏకు సరిపోలడంతో అవి శ్రద్ధావేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొంత విజయం సాధించారు.

Shraddha Murder Case: లవర్‌ను 35 ముక్కలుగా నరికి, ఆమె రింగ్‌ను కొత్త గర్ల్ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన అఫ్తాబ్

ఇదిలాఉంటే శ్రద్ధా కేసు విషయంలో పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణలో భాగంగా శ్రద్ధాను తానే చంపినట్లు ఆప్తాబ్ ఒప్పుకున్నాడు. అయితే, శ్రద్ధాతలను, బట్టలు పోలీసులు గుర్తించలేదు. శ్రద్ధా మొబైల్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని పోలీసులు నిందితుడి నుంచి రాబట్టే పనిలో ఉన్నారు.