Shraddha Murder Case: లవర్‌ను 35 ముక్కలుగా నరికి, ఆమె రింగ్‌ను కొత్త గర్ల్ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన అఫ్తాబ్

తన లవర్ శ్రద్ధా వాకర్ ని హత్య చేసి ఆమె బాడీని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్.. శ్రద్ధా చేతికున్న రింగ్ ను... తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది.

Shraddha Murder Case: లవర్‌ను 35 ముక్కలుగా నరికి, ఆమె రింగ్‌ను కొత్త గర్ల్ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన అఫ్తాబ్

Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు, షాకింగ్ నిజాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసు దర్యాఫ్తులో మరో విస్తుగొలిపే విషయం బయటపడింది. తన లవర్ శ్రద్ధా వాకర్ ని హత్య చేసి ఆమె బాడీని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్.. శ్రద్ధా చేతికున్న రింగ్ ను… తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది.

”అఫ్తాబ్.. శ్రద్ధాను 35 ముక్కలుగా నరికి.. ఆమె బాడీ పార్ట్స్ ను ఫ్రిడ్జ్ లో దాచాడు. ఆ తర్వాత మరో అమ్మాయి(డాక్టర్) ని ఇంటికి రప్పించుకున్నాడు. శ్రద్ధాను ముక్కలు చేసిన అతడు.. ఆమె వేలికున్న రింగ్ ను ఈ అమ్మాయికి గిఫ్ట్ గా ఇచ్చాడు” అని పోలీసులు వెల్లడించారు. తాజాగా ఆ ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని శ్రద్ధా తండ్రికి చూపించగా.. అది తన కూతురు ఉంగరమే అని ఆయన గుర్తించారు.

Also Read : Shraddha Murder Case: శ్రద్ధ హత్యలో మరొకరి ప్రమేయం ఉందా? ఆఫ్తాద్‌కు సహకరించారా? పోలీసుల అనుమానం ఇదే!

తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ ను అఫ్తాబ్ పూనావాలా మే 18న గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిడ్జ్ లో దాచాడు. ఆ తర్వాత వీలు చూసుకుని.. ఒక్కొక్కటిగా బాడీ పార్ట్స్ ను దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేశాడు. నవంబర్ 10న శ్రద్ధ కనిపించడం లేదంటూ అతడి తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు.. శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైనట్లు గుర్తించి షాక్ అయ్యారు.

Also Read.. Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

ఢిల్లీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కఠినమైన విచారణ తర్వాత అఫ్తాబ్ నిజాన్ని వెల్లడించడం ప్రారంభించాడు. అఫ్తాబ్‌కు చెందిన ఛతర్‌పూర్ ఫ్లాట్ నుంచి కీలకమైన సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. సాక్షులు లేనందున ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, సందర్భోచిత సాక్ష్యాలు.. ఈ కేసులో కీలకం కానున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.