Shraddha Murder Case: శ్రద్ధ హత్యలో మరొకరి ప్రమేయం ఉందా? ఆఫ్తాద్‌కు సహకరించారా? పోలీసుల అనుమానం ఇదే!

శ్రద్ధను హత్య చేయడంతోపాటు, ఆధారాలు తుడిచేయడంలో ఆఫ్తాద్‌కు మరొకరు సహకరించారా? ఈ విషయంపై పోలీసుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. విచారణలో భాగంగా ఆఫ్తాద్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది.

Shraddha Murder Case: శ్రద్ధ హత్యలో మరొకరి ప్రమేయం ఉందా? ఆఫ్తాద్‌కు సహకరించారా? పోలీసుల అనుమానం ఇదే!

Shraddha Murder Case: ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసును శోధిస్తున్న కొద్దీ పోలీసులకు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్య ఘటనలో నిందితుడు ఆఫ్తాద్ వ్యవహరించిన తీరు పోలీసుల్ని షాక్‌కు గురి చేస్తోంది. శ్రద్ధను హత్య చేయడం.. ముక్కలుగా నరకడం.. ఆధారాలు కనిపించకుండా రక్తపు మరకలు తుడిచేయడం వంటివి ఆఫ్తాద్ వైఖరిని చెప్తున్నాయి.

Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

అయితే, ఆఫ్తాద్ ఇంత పకడ్బందీగా వ్యవహరించడం వెనుక మరొకరి పాత్ర కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆఫ్తాద్‌కు ఎవరో ఒకరు సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శ్రద్ధను హత్య చేయడంతోపాటు, ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేయడంలో వేరే ఎవరో అతడికి సహకరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు విచారణలో ఆఫ్తాద్ ఒకదానితో ఒకటి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. విచారణలో భాగంగా తప్పుడు సమాచారం ఇస్తూ పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. దీంతో అతడికి వేరే ఎవరో సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆఫ్తాద్, శ్రద్ధ సన్నిహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ట్రెండింగ్ వీడియో

ఇప్పటికే తిహార్ జైలులో ఉన్న ఆఫ్తాద్ పూనావాలకు సంబంధించిన పాలిగ్రాఫ్ టెస్ట్ కొనసాగుతోంది. అతడి అనారోగ్యం వల్ల ఈ టెస్ట్ వేగంగా ముందుకు సాగడం లేదు. ఇది పూర్తైన తర్వాత అతడికి నార్కో టెస్ట్ నిర్వహిస్తారు. ఈ వారమే అతడికి నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పోలీసు అధికారులు పూర్తి చేశారు.