Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ట్రెండింగ్ వీడియో

విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అహ్మదాబాద్‌లో మోదీ స్టేడియం ఈ రికార్డుకు వేదికైంది.

Ruturaj Gaikwad: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ట్రెండింగ్ వీడియో

Ruturaj Gaikwad: దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల మోత మోగుతోంది. ఇటీవలే ఈ ట్రోఫీలో తమిళనాడు జట్టు ఒక మ్యాచ్‌లో 50 ఓవర్లకు 506 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అదే మ్యాచ్‌లో నారాయణ్ జగదీషన్ అనే బ్యాటర్ 271 పరుగులు చేశాడు.

Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

ఈ ట్రోఫీకి సంబంధించి ఇవి కొత్త రికార్డులు. ఈ ట్రోఫీలో తాజాగా మరో రికార్డ్ నమోదైంది. రుతురాజ్ గైక్వాడ్ అనే బ్యాటర్ ఏకంగా ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టాడు. మహారాష్ట్ర జట్టు తరఫున ఆడుతున్న రుతురాజ్ ఉత్తర ప్రదేశ్ జట్టుపై బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. శివ సింగ్ అనే బౌలర్ ఒక ఓవర్లో వేసిన ఏడు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు గైక్వాడ్. శివ సింగ్ ఐదో బంతిని నో బాల్‌గా వేశాడు. దీంతో అప్పటికే ఐదు సిక్సర్లు బాదిన గైక్వాడ్.. తర్వాత వచ్చిన రెండు బంతుల్ని కూడా సిక్సర్లుగా మలిచాడు. దీంతో అతడు వరుసగా ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు (42 పరుగులు) సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇక శివ సింగ్ ఒకే ఓవర్లో నో బాల్‌తో కలిపి 43 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్ 49వ ఓవర్లో ఈ రికార్డు సాధ్యమైంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఈ రికార్డుకు వేదికైంది.

Tata Steel plant: 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీ టవర్ క్షణాల్లో ఎలా కూలిందో చూడండి.. వైరల్ వీడియో

ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు కాగా, 16 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఫీట్ ద్వారా గైక్వాడ్ ప్రపంచస్థాయి ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇప్పటివరకు ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన క్రికెటర్లు సర్ గార్ ఫీల్డ్ సోబర్స్, రవి శాస్త్రి, హెర్ష్‌లీ గిబ్స్, యువరాజ్ సింగ్, రాస్ వైటెలీ, హజ్రతుల్లా జాజయ్, లియో కార్టర్, కీరన్ పొలార్డ్, తిషారా పెరెరా మాత్రమే.