Bihar :ముస్లిం పెద్దమనస్సు..బీహార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణానికి 2.5 కోట్ల విలువైన భూమి విరాళం

ఓ ముస్లిం కుటుంబం పెద్దమనస్సు చాటుకుంది.బీహార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణానికి 2.5 కోట్ల విలువైన భూమి విరాళంగా ఇచ్చింది.

Muslim Family Donates Land To Build World's Largest Hindu Temple

Muslim Family Donates Land to Build World’s Largest Hindu Temple :భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారతదేశం సొంతం. హిందూ ముస్లిం భాయీ భాయీగా కలిసి మెలిసి ఉండే దేవం భారతదేశం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లే భారత్ లోని బీహార్ లో మరోసారి మత సామరస్యం వెల్లివిరిచే ఘటన జరిగింది. బీహార్ లో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మాణం జరుగనుంది. ఈ హిందూ దేవాలయాన్ని నిర్మాణానికి ఓ ముస్లిం కుటుంబం అతి పెద్ద విరాళాన్ని అందజేసింది.

బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం విరాట్ రామాయణ్ మందిర్ (world’s largest Hindu temple–Virat Ramayan Mandirin)నిర్మాణానికి రూ.2.5 కోట్ల విలువైన స్థలాన్ని ఓ ముస్లిం కుటుంబం విరాళంగా ఇచ్చింది. తాము నిర్మించే ఆలయానికి రూ.2.5కోట్ల విలువైన భూమిని గౌహతిలోని ఇష్తయాక్ అహ్మద్ ఖాన్ విరాళంగా ఇచ్చారని ఆలయ నిర్మాణం చేపట్టిన మహావీర్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య కిషోర్ కునాల్ వెల్లడించారు. అహ్మద్ ఖాన్ వ్యాపారవేత్త. కేషారియా సబ్ డివిజన్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ఆలయ నిర్మాణం కోసం అహ్మద్ ఖాన్ కుటుంబానికి చెందిన భూమిని విరాళంగా ఇస్తూ రిజిస్ట్రేషన్ చేశారని ఐపీఎస్ మాజీ అధికారి అయిన ట్రస్ట్ చీఫ్ కిషోర్ తెలిపారు.

అహ్మద్ ఖాన్ కుటుంబం విరాళం అందించడంతో రెండు వర్గాల మధ్య సామాజిక సామరస్యం, సోదరభావం ఏర్పడిందని కిషోర్ అన్నారు. ముస్లిం కుటుంబం సహాయం లేకుండా తాము ఆలయ నిర్మాణం కల సాకారం అయ్యేది కాదని అన్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం మహావీర్ మందిర్ ట్రస్ట్ ఇప్పటివరకు 125 ఎకరాల భూమిని పలు రూపాల్లో పొందింది అని తెిపారు. ఈ ప్రాంతంలో ట్రస్టు త్వరలో మరో 25 ఎకరాల భూమిని కూడా పొందనుంది.

అంగ్కోర్ వాట్ మించిన విరాట్ రామాయణ మందిరం నిర్మాణం
విరాట్ రామాయణ మందిరం కంబోడియాలోని 12వ శతాబ్దపు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంగ్కోర్ వాట్ కాంప్లెక్స్ కంటే 215 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. తూర్పు చంపారన్‌లోని కాంప్లెక్స్ ఎత్తైన గోపురాలతో 18 ఆలయాలుంటాయి. ఈ ఆలయంలో శివాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆలయ నిర్మాణ ఖర్చ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.