పోలీసులకు పుట్టినరోజు సెలవు

  • Published By: venkaiahnaidu ,Published On : September 15, 2019 / 02:55 AM IST
పోలీసులకు పుట్టినరోజు సెలవు

Updated On : September 15, 2019 / 2:55 AM IST

బెంగళూరు పోలీసులకు బర్త్ డే హాలిడే వచ్చింది. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులకు తమ పుట్టిన రోజున సెలవు తీసుకొని ఫ్యామిలీతో గడిపేందుకుయ అవకాశం లభించింది. పోలీసులు తమ పుట్టిన రోజున సెలవు తీసుకునే విధంగా వీలుకల్పిస్తూ బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ఎన్ భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

నగరవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఈ సెలవుకి అర్హులని ఆదేశాల్లో తెలిపారు. తాము విధులు నిర్వహిస్తున్న స్టేషన్ అధికారి లేదా ఇన్ స్పెక్టర్ నుంచి వారందరూ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కమిషనర్లు, అధికారులు మరియు సిబ్బంది పుట్టినరోజున వారికి వారికి గ్రీటింగ్ కార్డు పంపబడుతుందని కమిషనర్ తెలిపారు.