నానమ్మ జ్ఞాపకాలలో ప్రియాంక :ఆమె చెప్పిన కథలు వినిపిస్తున్నాయి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉండే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో తనదైన శైలిలో కొనసాగుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 06:40 AM IST
నానమ్మ జ్ఞాపకాలలో ప్రియాంక :ఆమె చెప్పిన కథలు వినిపిస్తున్నాయి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉండే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో తనదైన శైలిలో కొనసాగుతున్నారు.

ఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉండే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో తనదైన శైలిలో కొనసాగుతున్నారు. యూపీలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రియాంకా గాంధీ ప్రయాగ్ రాజ్ లో తన పూర్వీకుల నివాసంలో సేదదీరుతున్నారు. ఈ క్రమంలో తన నాయనమ్మ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మించిన రూమ్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

స్వరాజ్ భవన్ లో ఇందిరమ్మ జన్మించిన ఫోటోను పోస్ట్ చేసిన ఆమె..”స్వరాజ్ భవన్ లో నేనున్న వేళ..నానమ్మ పుట్టిన గదిని చూసి చాలా చాలా ఆనందపడ్డానన్నారు. ఇదే సమయంలో ఆమె నాకు చెప్పిన ‘జోన్ ఆఫ్ ఆర్క్’ కథ గుర్తుకొచ్చిందనీ…ఆ కథ వింటూ నేను నిద్రపోవడం గుర్తొచ్చింది. ఆమె గొంతు ఇప్పటికీ నా హృదయంలో వినిపిస్తోనే ఉంది. భయం లేకుండా ఉండాలని, అప్పుడే అంతా మంచి జరుగుతుందని ఆమె చెప్పేవారు” అని ప్రియాంకా గాంధీ తన ఫీలింగ్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

స్వరాజ్ భవన్ లో 1917, నవంబర్ 19న జన్మించిన ఇందిరాగాంధీ, తన చిన్నతనంలో కొన్నేళ్ల పాటు ఇక్కడే కాలం గడిపారు. ఇక ప్రియాంక షేర్ చేసుకున్న చిత్రంలో గోడపై ఇందిరాగాంధీ చిన్న వయసులో తీయించుకున్న ఓ ఫోటో, దాని పక్కనే జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీలతో ఉన్న చిన్ననాటి ఇందిర ఫోటో ఉన్నాయి.