Azam Khan Son : తనపై దాడి జరగవచ్చు.. కుట్ర పన్నుతున్నారు – ఆజంఖాన్ తనయుడు

తనను ఫాలో అవుతున్నారని, కటకటాల వెనక్కి నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అబ్దుల్లా ఆజంఖాన్ ఇలాంటి ఆరోపణలు చేయడం...

UP Election 2022 : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందరి చూపు మాత్రం యూపీపైనే ఉంది. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ, అధికార పీఠం చేజిక్కించుకోవాలని ఎస్పీ వ్యూహాలు పన్నుతున్నాయి. ఇరుపార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. తాజాగా.. యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన రాంపూర్ లోని సువార్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. తనను ఫాలో అవుతున్నారని, కటకటాల వెనక్కి నెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అబ్దుల్లా ఆజంఖాన్ ఇలాంటి ఆరోపణలు చేయడం రెండోసారి.

Read More : Covid-19: సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఇండియలో తొలి కేసు నమోదైన రోజు

సువార్, రాంపూర్ స్థానాల బీజేపీ అభ్యర్థులు తనను చంపడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు భద్రత కల్పిస్తున్న పోలీసులపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా తనను కాల్చగలరని ఆరోపించారు. సువార్ సీటులో నవాబ్ కుటుంబానికి చెందిన హైదర్ ఆలీఖాన్ ను బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్ బరిలోకి దింపింది. బీజేపీకి అధికారులున్నారని అంతేగాకుండా పోలీసులు కూడా వారితో ఉన్నారని, తాను మాత్రం ఒంటరిగా ఉన్నానని ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు. సమాజ్ వాదీని పాక్ అనుకూల పార్టీగా, మహ్మద్ ఆలీ అనుచరుడిగా బీజేపీ విమర్శలు చేయడంపై అబ్దుల్లా ఆజంఖాన్ స్పందించారు. ముందు.. లఖీంపూర్ ఖేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎప్పుడు న్యాయం చేస్తారో ముందుగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read More : Karnataka Farmer : రైతు ఇంటికి వచ్చిన బొలెరో వాహనం.. క్షమాపణలు చెప్పిన మహీంద్రా ప్రతినిధులు

తాను జైలులో ఉన్నప్పుడు ఎంతో నేర్చుకున్నట్లు, అదొక పీడకలగా ఆయన అభివర్ణించారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. తమ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారాయన. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గం నుంచి తాను నామినేషన్ వేయడం జరిగిందని కానీ…నకిలీ బర్త్ సర్టిఫికేట్ ఉపయోగించారని ఆరోపించారని తెలిపారు. కానీ అవి నకిలీవి కావని.. ప్రస్తుతం బీజేపీ తన నామినేషన్ రద్దు చేసేందుకు ప్రయత్నించవచ్చన్నారు. 2017లో ఆయన సువార్ నియోజకర్గం నుంచి ఎన్నికైనా.. నకిలీ ధృవీకరణపత్రం కేసులో 2019లో అనర్హుడయ్యారు. ఇతని తండ్రి రాంపూర్ ఎంపీ ఆజంఖాన్ విషయానికి వస్తే… 100కు పైగా కేసులు నమోదయ్యాయి. గత 23 నెలలుగా జైలులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు