Covid-19: సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఇండియలో తొలి కేసు నమోదైన రోజు

పలు రకాలైన మందులు, చికిత్స కోసం చేస్తున్న ప్రయత్నాలు సరైన డ్రగ్ కనిపెట్టలేకపోయినా.. పోరాటం జరుగుతూనే ఉంది. వూహాన్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ సెమిస్టర్ హాలీడేస్...

Covid-19: సరిగ్గా రెండేళ్ల క్రితం.. ఇండియలో తొలి కేసు నమోదైన రోజు

India Covid Cases New Covid Cases And Deaths In National Wide

Covid-19: కొవిడ్-19 మహమ్మారిని ఇండియాలో గుర్తించి సరిగ్గా 2022 జనవరి 30 నాటికి రెండేళ్లు పూర్తి అయింది. పలు రకాలైన మందులు, చికిత్స కోసం చేస్తున్న ప్రయత్నాలు సరైన డ్రగ్ కనిపెట్టలేకపోయినా.. పోరాటం జరుగుతూనే ఉంది. వ్యాక్సిన్లు, మాస్కులు, సామాజిక దూరంతో ఇండియా పోరాడుతూనే ఉంది.

వూహాన్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ సెమిస్టర్ హాలీడేస్ కు ఇండియాకు రావడంతో తొలికేసు నమోదైంది. అప్పట్నుంచి దారుణమైన ఫస్ట్ వేవ్, మృత్యుభయం పుట్టించిన సెకండ్ వేవ్ కళ్లముందు మరువకముందే మరోసారి పెరుగుతున్న కేసులు మూడో వేవ్ తెప్పిస్తుందా అనే ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.

ఈ ట్రీట్మెంట్ లో భాగంగా వాడుతున్న డ్రగ్ లపై నీతి అయోగ్ సభ్యులు డా. వీ కే పాల్ కామెంట్ చేశారు. స్టెరాయిడ్స్ వాడకం ముకోర్మికోసిస్ (బ్లాక్ ఫంగస్)పెంచడానికి కారణమవుతుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయిన వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. వ్యాధి నిరోధక వ్యవస్థపై చూపించే ప్రభావం తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా.. పలు రకాలుగా దెబ్బతీస్తుంది.

Read Also : విన్ డీజిల్‌కి విలన్‌గా ‘ఆక్వామెన్’ హీరో..

‘జ్వరానికి పారాసిటమాల్, దగ్గుకు ఆయుష్ సిరప్ వాడటం బెటర్. ఇంట్లో ఉండి మెడిసిన్ తీసుకునే వారు మూడు రోజుల కంటే ఎక్కువగా దగ్గు వస్తుంటే బ్యూడెసోనైడ్ ఇన్హేలర్ వాడాలి. ఈ మూడు విషయాలు మరువకూడదు. ఇవి కాకుండా చేయాల్సిందేంటంటే రెస్ట్’ అని హెచ్చరిస్తున్నారు.