Tamil Nadu Elections: : ఎన్నికల సిత్రాలు, దోశ వేసిన ఖష్బూ…స్మృతి ఇరానీ దాండియా

ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లిన ఖుష్బూ..దోశ వేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ కార్యకర్తలతో దాండియా ఆడారు...

Khushbu Dosa, Smriti Dandiya : ఎన్నికలు వచ్చాయంటే..చాలు.. సందడే సందడి. అభ్యర్థుల ప్రచారం..మాటల తూటాలు, ఆరోపణలు, విమర్శలతో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కుతుంటాయి. నామినేషన్ ప్రక్రియ మొదలుకొని..ఓటింగ్ అయ్యేదాక ఇదే తంతు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. వారు చేయాల్సిన పనులు అభ్యర్థులు చేస్తూ..ఓట్లు అడుగుతున్నారు. తమిళనాడులో ఇలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి.

చెన్నై థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున సినీ నటి ఖుష్బూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా..ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లిన ఖుష్బూ..దోశ వేసేందుకు యత్నించారు. పెనంపై నూనె రాయకుండా దోశ వేయడంతో కానీ..అది రాలేదు. దీంతో మరోసారి ప్రయత్నించారు. ఈసారి ఫర్ఫెక్ట్ గా దోశ వేయడంలో సక్సెస్ అయ్యారు.

మరోవైపు…బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించేందుకు అక్కడకు వెళ్లారు. బీజేపీ కార్యకర్తలతో దాండియా ఆడారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.


Read More : No Holi : హోలీ సంబరాలు వద్దు, ఈ రాష్ట్రాల్లో నిషేధం

ట్రెండింగ్ వార్తలు