MLA Geeta bharat jain
MLA Geeta bharat jain: మహారాష్ట్ర (Maharashtra) లోనే థానే జిల్లా (Thane district)కు చెందిన ఎమ్మెల్యే గీతా జైన్ (MLA Geeta bharat jain) మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్(MBMC) లో పనిచేస్తున్న జూనియర్ సివిల్ ఇంజినీర్ (junior Civil engineer) పై చేయిచేసుకున్నారు. అతని చొక్కా గల్లాపట్టి చెంప పగలగొట్టారు. చెంపదెబ్బ తిన్న జూనియర్ ఇంజినీర్ ఎంబీఎంసీ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం, ఎమ్మెల్యే ఇంజినీర్‌ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. తొలుత ఎమ్మెల్యే ఇద్దరు ఇంజనీర్లను మందలించడం కనిపించింది. కొద్దిసేపటికే ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయిన ఆమె.. జూనియర్ సివిల్ ఇంజనీర్ పై చేయి చేసుకుంది.
Women Height Increased: మోదీ ప్రభుత్వంలో జరిగిన అద్భుతం.. మహిళలు ఎత్తు పెరుగుతున్నారట!
ఎమ్మెల్యే ఉద్యోగిపై ఎందుకు చేయిచేసుకున్నారని ఆరా తీయగా.. వర్షాకాలానికి ముందు ఎంబీఎంసీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండటమే కారణమట. కాశిమీరాలోని పెంకర్పాడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వర్షాకాలం ముందు నిర్మాణాలను నేలమట్టం చేయడంతో వర్షాకాలం ముందు చిన్నారులతో పాటు కొందరు ఆక్రమణదారులు రోడ్డున పడ్డారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారంటూ సిబ్బందిని నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ సివిల్ ఇంజినీర్ పై ఎమ్మెల్యే చేయిచేసుకొని దూషించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతా జైన్ గతంలో బీజేపీ నుంచి మేయర్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ – శివసేన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.
India-China Relations: చైనా-భారత్ సరిహద్దు పరిస్థితిపై భారత్ వైఖరి స్పష్టం చేసిన ప్రధాని మోదీ
ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఘటనపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. నేను ఇద్దరు ఇంజనీర్లను వర్షాకాలానికి ముందే కట్టడాలను ఎందుకు కూల్చివేశారని అడిగాను. కూల్చివేసిన ఇల్లు ఒక స్త్రీకి సంబంధించింది. ఆమె తన పిల్లలతో అక్కడే ఉండిపోయింది. దీంతో నేను ఆమె ఇబ్బంది చూసి సిబ్బందిని మందలించాను. కానీ వారు నవ్వుకున్నారు. ఒక స్త్రీని అవమానించడాన్ని నేను సహించలేకనే ఇంజినీర్ పై చేయిచేసుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం పడటం లేదని, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే గీతా జైన్ స్పష్టం చేశారు.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023