Bhopal : అనారోగ్యం కారణాలతో బెయిల్…క్రికెట్ ఆడిన వీల్‌‌ఛైర్ ఎంపీ ప్రగ్యాసింగ్

అనుచరులు ఉత్సాహపరుస్తుంటే..ఆమె బ్యాట్ తో షాట్లు కొట్టారు. 2008లో మాలేగావ్ బాంబు పేలుళ్లలో 10 మంది చనిపోయారు. ఈ కేసులో ఆమెపై పలు ఆరోపణలున్నాయి.

Pragya

BJP MP Pragya Singh : మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అనారోగ్య కారణాలు చూపి మాలేగావ్ పేలుళ్ల కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె..క్రికెట్ ఆడుతూ కనిపించారు. సాధారణంగా వీల్ ఛైర్ లో ఉంటూ..పలు కార్యక్రమాల్లో పాల్గొనే ఎంపీ..క్రికెట్ ఆడడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక నిమిషం పాటు ఈ వీడియో ఉంది. కాషాయవస్త్రాలు ధరించిన ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ భోపాల్ లోని శక్తినగర్ ప్రాంతంలో క్రికెట్ ఆడారు. అనుచరులు ఉత్సాహపరుస్తుంటే..ఆమె బ్యాట్ తో షాట్లు కొట్టారు. 2008లో మాలేగావ్ బాంబు పేలుళ్లలో 10 మంది చనిపోయారు. ఈ కేసులో ఆమెపై పలు ఆరోపణలున్నాయి.

Read More : Nikhil Siddhartha : ఏపీలో థియేటర్ల పరిస్థితిపై గళమెత్తిన మరో యంగ్ హీరో..

అనారోగ్య కారణాలు చూపి..2017లో బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆమె వీల్ ఛైర్ లో కనిపించారు. ఇటీవలే బాస్కెట్ బాల్ ఆడడం, నవరాత్రి ఉత్సవాల్లో గార్బా డ్యాన్స్ చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఆమెపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అక్టోబర్ నెలలో కాళీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం భోపాల్ లో ఓ మైదానంలో మహిళా క్రీడాకారులతో కబడ్డీ ఆడారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో భోపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై 3.6 లక్షల ఓట్లతో ప్రగ్యాసింగ్ ఠాకూర్ విజయం సాధించారు.