బీజేపీ-టీఎంసీ బాహాబాహీ : బీజేపీ ఎంపీకి గాయాలు..కారు ధ్వంసం 

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 10:33 AM IST
బీజేపీ-టీఎంసీ బాహాబాహీ : బీజేపీ ఎంపీకి గాయాలు..కారు ధ్వంసం 

Updated On : September 1, 2019 / 10:33 AM IST

పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో బరాక్‌పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ వెంటనే ఘటనాస్థలానికి కారులో చేరుకున్నారు. ఈక్రమంలో ఎంపీ అర్జన్ సింగ్ కారును టీఎంసీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు ధ్వంసం చేశారు. శ్యామ్‌నగర్ ప్రాంతంలో ఆదివారం (సెప్టెంబర్ 1) ఉదయం ఈ ఘటన జరిగింది.

బీజేపీ కార్యాలయంపై మమతా బెనర్జీ ఫోటో ఉన్న బ్యానర్లు కట్టడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ సమచారం అందుకున్న  అర్జున్ సింగ్ తన కార్యకర్తలతో కలిసి హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. దీంతో టీఎంసీ,బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆయన కారు ధ్వంసమైంది.  

ఈ ఘటనపై ఎంపీ అర్జున్ సింగ్ మాట్లాడుతూ..సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతోనే ఆ పార్టీ కార్యకర్తలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనీ..తన ఇంటిపై కూడా దాడి జరుగుతోందని..కమిషనర్  మనోజ్ వర్మ తనపై దాడి చేసి..అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తలు చేస్తున్న ఇటువంటి దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజం ఉండటంలేదని అన్నారు.

కాగా అర్జున్ సింగ్ ఆరోపణలను 24 పరగణాల జిల్లా ఇన్ చార్జ్, మంత్రి జ్యోతిప్రియో ములిక్ తోసిపుచ్చారు. టీఎంసీ ఆఫీసుల్ని బీజేపీ కాషాయం రంగులు వేసి బీజేపీ ఆక్రమించుకుంటోందని..అటువంటి ఆఫీసులు 180కి పైగా ఉన్నాయన్నారు. వాటిని కూడా తాము అధీనంలోకి తీసుకోవడం ఖాయమని మంత్రి స్పష్టంచేశారు. కాగా, ఆదివారం  టీఎంసీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్టు సమాచారం తెలియగానే స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనాస్థనికి  చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.