కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి దగ్గరి మిత్రుడిగా ఉన్న జ్యోతిరాధిత్య బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. అయితే జ్యోతిరాధిత్య కాషాయ కండువా కప్పుకున్న కొద్దిసేపటికే బీజేపీ అధిష్ఠానం ఆయనకు బంపరాఫర్ ప్రకటించింది.
మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాధిత్యను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ఇవాళ ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఇవాళ బీజేపీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల్లో సింధియా ఒకరు. కాంగ్రెస్ లో రాజ్యసభ సీటు విషయంలో ఎలాంటి హామీ లేకపోవడంతోనే సింధియా బీజేపీవైపు మొగ్గు చూపుతున్నాడని,బీజేపీలో ఆయనకు రాజ్యసభ సీటు,కేంద్రమంత్రి హామీ లభించిందని నిన్నటివరకు రాజకీయ వర్గాల నుంచి వినిపించిన మాట. ఇప్పుడు అదే నిజమేనని ఇవాళ సింధియాకు రాజ్యసభ సీటు ప్రకటించడం బట్టి అర్థమవుతోంది. త్వరలోనే సింధియా కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్నదని సృష్టంగా అర్థమవుతోంది.
రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ అయిన సింధియాకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం,బీజేపీ సీనియర్ లీడర్ శివరాజ్ సింగ్ చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని మూడు రాజ్యసభ స్థానాలకు మార్చి-26,2020న ఎన్నికలు జరిగనున్నాయి. అయితే ఇందులో బీజేపీకి ఒకటి,కాంగ్రెస్ కు ఒకటి ఫిక్స్ ఇప్పటికే అయిపోయింది. ఇక మూడో సీటు విషయంలోనే ఏం జరగనుందో తెలియాల్సి ఉంది.
See Also | చంద్రబాబుకి మరో షాక్, కడపలో టీడీపీకి పెద్ద దిక్కు పోయె