దారుణం.. బహిరంగ సభలో కాంగ్రెస్ మహిళా నేతకు లైంగిక వేధింపులు..! అక్కడ చెయ్యి వేసి..

ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వీడియోని బీజేపీ వైరల్ చేస్తోంది.

Congress Woman Worker Molested (Photo Credit : Google)

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. వారిపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయి. జనాలు లేని ప్రాంతాల్లోనే కాదు.. చుట్టూ జనాలు ఉన్నా.. పబ్లిక్ ప్లేసుల్లోనూ వారికి సేఫ్టీ లేకుండా పోతోంది. కొందరు నీచులు బహిరంగంగానే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా కాంగ్రెస్ మహిళా నేతకే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హరియానాలో ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ మహిళ నేతకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఓ మహిళా నేత వేదికపై ఉండగా.. సొంత పార్టీ నేత నుంచే వేధింపులు ఎదుర్కొన్నారు. ఆమెను వెనుక నుంచి తాకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అక్కడ టచ్ చేయబోయాడు. ఇంతలో పక్కనే ఉన్న మరో వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని బీజేపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వీడియోని బీజేపీ వైరల్ చేస్తోంది. దీని ద్వారా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ నేతకే రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ది యాంటీ ఉమెన్ మైండ్ సెట్ అంటూ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు వచ్చేశాయ్.. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసా?

దీనిపై కాంగ్రెస్ ఎంపీ కుమారి షెల్జా స్పందించారు. “నేను ఆమెతో మాట్లాడాను, కొంతమంది తనను తాకుతున్నారని, వేదిక పైనుండి పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారని ఆమె నాకు చెప్పింది. మేము వీడియోలో కూడా చూశాము. తనతో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె తెలిపింది. ఇది ఖండించాల్సిన విషయం. కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి” అని ఎంపీ షెల్జా అన్నారు.