With the defeat in the municipal elections, BJP grip on Delhi was further loosened
COVID-19: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు భారత్ లోనూ 4 నమోదు కావడం, ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రను నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమ జన్ ఆక్రోశ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారు.
రాజస్థాన్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో జన్ ఆక్రోశ్ యాత్రను ప్రారంభిస్తారని డిసెంబరు 1న బీజేపీ ప్రకటించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పరిపాలనలోని లోపాలను ఎత్తిచూపుతామని చెప్పింది. అయితే, కరోనా విజృంభణ వేళ ఈ యాత్రను నిర్వహించడం సరికాదని తాజాగా నిర్ణయించింది.
బీజేపీకి రాజకీయాలకన్నా ప్రజలే ముఖ్యమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రజల రక్షణ, వారి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర ఉదయం, సాయంత్రం వేళ చేసే నడకలా మారిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్రను ఆయన ఓ ఫ్లాప్ షోగా అభివర్ణించారు.
BF-7 Variant : చెన్నైలో కొత్త కోవిడ్ కేసులు..ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం స్టాలిన్ భేటీ