Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మమతా బెనర్జీని జైలుకు పంపుతాం: సువేందు అధికారి

సందేశ్‌ఖాలీలో జరిగిన దాన్ని మర్చిపోవాలని మమతా బెనర్జీ ప్రజలను కోరారని సువేందు అధికారి అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జైలుకు పంపుతామని పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటనలపై దర్యాప్తు చేయడానికి కమిషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సందేశ్‌ఖాలీలో జరిగిన దాన్ని మర్చిపోవాలని మమతా బెనర్జీ ప్రజలను కోరారని సువేందు అధికారి అన్నారు. అయితే, సందేశ్‌ఖాలీ ప్రజలు ఆ ఘటనను మర్చిపోరని చెప్పారు. తాను కూడా మర్చిపోలేనని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్‌ఖలీ ఘటనలపై విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలను కేసుల్లో ఇరికించి మమతా బెనర్జీ జైలుకు పంపారని చెప్పారు. మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు మమతా బెనర్జీని కూడా బీజేపీ జైలుకు పంపుతుందని అన్నారు. తాము చట్టం ప్రకారం రాజ్యాంగ పరిమితుల్లోనే ఉంటూ.. వడ్డీతో ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.

షాజహాన్ షేక్ వంటి స్థానిక టీఎంసీ నేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఆ ప్రాంతంలోని మహిళలపై తప్పుడు కేసులు పెట్టేందుకు మమతా బెనర్జీ కుట్ర పన్నారని సువేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో 2016 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి హైకోర్టులో ఊరట..