వేదికపై కూర్చొబోతూ కిందపడ్డ బీజేపీ లీడర్

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 12:37 AM IST
వేదికపై కూర్చొబోతూ కిందపడ్డ బీజేపీ లీడర్

Updated On : November 23, 2020 / 8:46 AM IST

BJP’s Ravi Kishan falls off chair : అప్పుడప్పుడు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. సన్మానం చేసిన తర్వాత..కూర్చొనడానికి ప్రయత్నించిన ఓ బీజేపీ లీడర్ కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గోరక్ పూర్ లో చోటు చేసుకుంది.



ఛత్ పూజ సందర్భంగా గోరఖ్ పూర్ లో అన్ని ప్రధాన ఘాట్ లను సందర్శించాలని నటుడు, బీజేపీ నేత రవి కిషన్ భావించారు. అందులో భాగంగా పలు ఘాట్ లను తనిఖీ చేసిన అనంతరం ఓ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రజలకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది రవి కిషన్ ను సన్మానించారు. ఓ వ్యక్తి శాలువ కప్పాడు. అనంతరం కూర్చొనడానికి ప్రయత్నించారు. అమాంతం…కిందపడిపోయారు. అక్కడున్న వారు రవి కిషన్ ను లేపారు. కుర్చీ మరీ దూరంగా వేయడంతోనే కింద పడిపోయారంటున్నారు.



గోరఖ్ పూర్ లోని అన్ని ప్రధాన ఘాట్ ను పరిశీలించడం జరిగిందని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించారని రవి కిషన్ తెలిపారు. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించారన్నారు. గత నెలలో యోగా గురువు బాబా రాందేవ్ బాగా ఏనుగుపై యోగా చేస్తూ..కిందపడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.