Blind Old Man
Blind Old Man : సమస్యలు మనుషులకే వస్తాయి.. కొందరు సమస్యను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు మాత్రం దాన్ని పరిష్కారానికి మార్గం వెతుకుంటారు. ఆలా మార్గం వెతికి సమస్యనుంచి బయటపడి పదిమందికి ఆదర్శనంగా నిలుస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఈ కోవకు చెందిన వారే. ఓ ప్రమాదంలో రెండు కళ్ళు కోల్పోవడంతో ఏం చెయ్యాలో అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరకు తనకు కళ్ళు కనిపించకపోయినా పని చేయగలని ఆత్మవిశ్వాసం పెంచుకొని కళ్ళు ఉన్నవారిలాగానే పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు.
నాసిక్‌లోని మఖ్‌మలబాద్ రోడ్డు పక్కనే ఇతని అరటి చిప్స్ దుకాణం ఉంది. మరుగుతున్న నూనెలో అరటి చిప్స్ చకచకా వేసి, బాగా వేగాక వాటిని ఒక పెద్ద గరిటెతో పక్కనే ఉన్న బేసిన్‌లో వేస్తాడు. తర్వాత హెల్పర్ వాటిని ఉప్పుకారంతో బాగాకలిపి ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్‌చేయడం ఈ వీడియోలో కన్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను శాన్‌స్కర్ స్కేమణి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More : Salman Khan : ప్రొడ్యూసర్స్ ఫిక్స్ చేసేశారు..
ఇక వీడియో కింద ఆయన వివరాలు రాసుకొచ్చారు శాన్‌స్కర్ స్కేమణి ‘ఈ ఓల్డ్‌మాన్‌కి మర్యాద ఇవ్వండి. నాసిక్‌లో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ఈ వృద్ధుడు తయారు చేసిన చిప్స్ కొనమని చెప్పండి. గిరాకీ పెంచితే అతనికి తిరిగి చూపును ప్రసాదించడంలో మనమందరం సహాయపడగలం’ అనే కాప్షన్‌ను ఈ పోస్టుకు జోడించాడు. అంతే కాదు ఈ వీడియో ద్వారా అతని చూపుకోసం విరాళాలు సేకరిస్తున్నాడట కూడా. కాగా ధర్మల్ పవర్ ప్లాంట్‌లోని వేడి, ఆవిరి కారణంగా అతను చూపు కోల్పోయాడని అధికారిక సమాచారం. ఇక పోస్టు చేసిన వారం రోజుల్లోనే ఈ వీడియోను 12 లక్షల మంది వీక్షించారు.