బోర్డు పరీక్షలలో ప్రతి మార్కు ముఖ్యమైనదే. ఒకే ఒక్క మార్కుతో టాప్ ర్యాంక్ కోల్పోవచ్చు. అదే మార్కుతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు. సాధారణంగా టీచర్లు పేపర్లు దిద్దేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారు చేసే పొరపాట్లు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయి.
జవాబు పత్రాలు దిద్దాక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయో జాగ్రత్తగా లెక్కపెట్టి వేయాల్సి ఉంటుంది. అయితే, ఓ విద్యార్థికి ఉపాధ్యాయుడు 30 మార్కులు తక్కువ వేసి, అతడు ఫెయిల్ కావడానికి కారణమయ్యాడు. గుజరాత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిల్ కావడంతో ఆ విద్యార్థి గుజరాత్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ కు రీ-అసెస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఆన్సర్ పేపర్‌ను మళ్లీ దిద్దడంతో.. ఉపాధ్యాయుడు మార్కులను తప్పుగా లెక్కపెట్టి వేసినందుకే ఆ విద్యార్థి ఫెయిల్ అయ్యాడని తేలింది. అసలు ఎవరో ఒక్క ఉపాధ్యాయుడు కాదు.. ఈ ఏడాది మొత్తం 4,488 మంది ఉపాధ్యాయులు 10వ, 12వ తరగతుల జవాబు పత్రాలు దిద్దడంలో పొరపాట్లు చేశారు. తప్పులు చేసిన ఉపాధ్యాయులకు జరిమానా రూపంలో ఏకంగా రూ.64 లక్షల జరిమానా విధిస్తున్నామని జీఎస్ఈబీ అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ హమాస్‌ల మధ్య భీకర యుద్ధం.. వరుస దాడుల్లో పౌరులు దుర్మరణం