Chhattisgarh: బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఖాతాలోకి నెలకు వెయ్యి జమ చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలందరికీ ‘మహతారీ వందన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద మహిళలకు ప్రతీనెలా రూ. వెయ్యి రూపాయలు ..

Sunny Leone
Sunny Leone: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి సన్నీలియోన్ పేరుతో ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న పథకం నుంచి నెలనెలా వెయ్యి రూపాయలు పొందుతున్నాడు. కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతుంది. తాజాగా అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం బయటకు రావడంతో.. కంగుతిన్న అధికారులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు అతడు ఎంత మొత్తం లబ్ధిపొందాడనే వివరాలను సేకరిస్తున్నారు. ఆ మొత్తాన్ని అతని నుంచి రికవరీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తివివరాల్లోకి వెళితే..
Also Read: Video: చాలా మంచి పెంగ్విన్.. ప్రేమికులను డిస్టర్బ్ చేయకుండా ఈ పెంగ్విన్ ఏం చేసిందో చూడండి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలందరికీ ‘మహతారీ వందన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద మహిళలకు ప్రతీనెలా రూ. వెయ్యి రూపాయలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే, బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామంకు చెందిన వీరేద్ర జోషి అనే వ్యక్తి బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుతో మహిళగా ఖాతా తెరిచి లబ్ధిపొందుతున్నాడు. ఆమె భర్త పేరు జానీ సిన్స్ నమోదు చేశాడు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ నెలా లబ్ధిదారుడి ఖాతాలో రూ. వెయ్యి జమ అవుతుంది. తాజాగా అధికారుల తనిఖీల్లో వీరేంద్ర జోషి మోసం వెలుగులోకి వచ్చింది.
Also Read: Narendra Modi: కువైట్ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధాని మోదీ
ఈ విషయంపై బస్తర్ జిల్లా కలెక్టర్ హరీశ్ ఎస్ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే సంబంధిత బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశాం. పథకం కింద విడుదలైన మొత్తాన్ని రికవరీ చేయడమే కాకుండా.. పథకం ప్రయోజనాలను మోసపూరితంగా పొందారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత పథకానికి ఎలా అర్హత పొందాడనే విషయాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఇదిలాఉంటే.. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. దరఖాస్తును నమోదు చేసిన అంగన్ వాడీ కార్యకర్త, వెరిఫికేషన్ చేయకుండా అనుమతి ఇచ్చిన సూపర్ వైజర్ పైనా కఠిన చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా ఘటనతో పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.