పసిపిల్లపై 12 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులు

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 08:36 AM IST
పసిపిల్లపై 12 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులు

Updated On : July 26, 2020 / 9:23 AM IST

దారుణం..ఓ 12 ఏళ్ల బాలుడు..పసిపిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బులంద్ షహర్ Debai పీఎస్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 12ఏళ్ల బాలుడిపై ఆరోపణలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పసిపిల్లకు గాయాలు జరిగాయో లేదో తెలుసుకొనేందుకు వైద్య పరీక్షల కోసం బులంద్ షహర్ ఆసుపత్రికి పంపినట్లు సీనియర్ పోలీసు సూపరిటెండెంట్ సంతోష్ కుమార్ సింగ్ వెల్లడించారు.

శుక్రవారం రాత్రి అందిన సమాచారం ఆధారంగా..బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పసిపిల్లపై శరీరంపై ఎలాంటి గాయాలు కనబడలేదని వైద్యులు వెల్లడించారని, అయితే..రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామన్నారు.

ఓ వైపు భారతదేశంలో లక్షలాది కరోనా కేసులు..వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న క్రమంలో..ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అభం..శుభం తెలియని పసికందులు, బాలికలపై కామాంధులు రెచ్చిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.