Bride
bride: అప్పుడే పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. పెళ్లి తంతు ముగిసిందో.. లేదో.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో గురువారం జరిగింది. బర్మార్ పట్టణానికి చెందిన హీరూ దేవి బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు మారుది పట్టణానికి చెందిన గొమరంతో ఈ నెల 21న పెళ్లి జరిగింది. అదే రోజు మధ్యాహ్నం ఆమెకు పరీక్ష కూడా ఉంది. అయితే, ముందుగా పెళ్లి తంతు పూర్తి చేసుకుంది. పెళ్లి పూర్తైన వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులను పెళ్లి మండపంలోనే వదిలేసి, భర్తతో కలిసి పరీక్షా కేంద్రానికి బయలుదేరింది.
Bride Cheating : పెళ్లికి మూడు రోజలు ముందు డబ్బు తీసుకుని వధువు పరార్
స్థానిక బిక్‌చంద్ చాజెద్ కన్యా పీజీ కాలేజ్‌కు నవ దంపతులు ఇద్దరూ పెళ్లి దుస్తుల్లోనే చేరుకున్నారు. హీరూ దేవి పరీక్షా కేంద్రానికి వెళ్లి బీఎస్సీ థర్డ్ ఇయర్ పరీక్ష రాసి వచ్చేంతవరకు వరుడు ఆమె కోసం అక్కడే ఎదురు చూశాడు. పరీక్ష అనంతరం ఇద్దరూ తిరిగి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు తనను చదువుకోవాలని కోరుకున్నట్లు, అందుకే పెళ్లి రోజైనా పరీక్షకు హాజరైనట్లు హీరూ దేవి చెప్పింది. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ చాలా అవసరమని, అందుకే హీరూ పరీక్ష రాసేందుకు ప్రాధాన్యం ఇచ్చిందని నవ వరుడు గొమరం చెప్పాడు. పెళ్లి దుస్తుల్లో పరీక్ష కోసం వచ్చిన కొత్త జంటను స్థానికులు అభినందించారు.