Pune : కారు బ్యానెట్‌‌పై కూర్చొన్న వధువు..చిక్కులో పడేసింది

ఓ వధువు..కారులో పెళ్లి మంటపానికి వచ్చింది. అయితే..కారులో కూర్చొకుండా..దాని బ్యానెట్ పై కూర్చొని రావడంతో చిక్కులు వచ్చి పడ్డాయి. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Pune : కారు బ్యానెట్‌‌పై కూర్చొన్న వధువు..చిక్కులో పడేసింది

Car

Updated On : July 14, 2021 / 1:29 PM IST

Bride Sits On Car Bonnet :  పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరుగుతుంటాయి. అయితే..పెళ్లి తంతును గుర్తుండిపోయేలా నిర్వహించుకోవాలని కొంత మంది అనుకుంటున్నారు. అనుకున్నట్లుగా పెళ్లిళ్లు చేసుకుంటారు. వినూత్నంగా చేసుకొనే ఈ వివాహాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. అయితే..కొన్ని వివాదాస్పదమౌతాయి. పలువురు చిక్కుల్లో పడుతుంటారు. ఇలాగే..జరిగింది.

Read More : Pak Drone : భారత్ – పాక్ బోర్డర్, మరో డ్రోన్ కలకలం

ఓ వధువు..కారులో పెళ్లి మంటపానికి వచ్చింది. అయితే..కారులో కూర్చొకుండా..దాని బ్యానెట్ పై కూర్చొని రావడంతో చిక్కులు వచ్చి పడ్డాయి. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. సాస్వద్ లోని సిద్దేశ్వర ఫంక్షన్ హాల్ లో వివాహ వేడుక జరిగింది. పెళ్లి మంటపానికి సమయంలో పెళ్లి కూతురు అందంగా తయారైంది.

Read More : Dia Mirza Welcomed Boy : బాబుకు జన్మనిచ్చిన నటి దియా మిర్జా.. ఎమోషనల్ పోస్టు!

స్కార్పియో కారు బ్యానెట్ పై కూర్చొంది. ఘాట్ రోడ్డులో మెళ్లిగా వెళుతోంది. దీనిని బైక్ పై కూర్చొని వీడియో తీశారు. ఫొటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ…పెళ్లి మంటపానికి చేరుకుంది. కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. కరోనా సమయంలో మాస్క్ ధరించకపోవడం, ఘాట్ రోడ్డులో ప్రమాదకరంగా వెళ్లడంపై కేసు బుక్ చేశారు పోలీసులు.