నో ఎంట్రీ…కశ్మీర్ పై భారత్ ను విమర్శించిన బ్రిటన్ ఎంపీకి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం

  • Published By: venkaiahnaidu ,Published On : February 17, 2020 / 02:57 PM IST
నో ఎంట్రీ…కశ్మీర్ పై భారత్ ను విమర్శించిన బ్రిటన్ ఎంపీకి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం

Updated On : February 17, 2020 / 2:57 PM IST

కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ కి పంపించారు. ఆమె ఈ వీసా తిరస్కరణకు గురైందని,దీంతో ఆమెను భారత్ లో పర్యటించేందుకు అనుమతించలేదని అధికార వర్గాలు తెలిపాయి.

కశ్మీర్‌లో పర్యటన చేయనున్న పార్లమెంటరీ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న డెబ్బీ అబ్రహాం మాట్లాడుతూ….దుబాయ్ నుంచి సోమవారం(ఫిబ్రవరి-17,2020) ఉదయం 8:50 గంటలకు ఢిల్లీ ఎయిరోపోర్టులో ల్యాండ్ అయ్యాము. అయితే గత అక్టోబర్ లో జారీ చేసిన ఈ- వీసా గడువు ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉన్న వీసా గడవు ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ డెస్క్ దగ్గర ఈ-వీసా సహా పలు డాక్యుమెంట్లతో తాను ఉదయం హాజరయ్యాను.నా ఫొటోలు కూడా తీసుకున్నారు. స్కీన్ లో నన్ను అధికారి చూశాడు. తలను ఊపుతూ ఆ అధికారి..మీ వీసా తిరస్కరించబడింది అని చెప్పారు. ఆ తర్వాత తన పాస్ పోర్ట్ తీసుకొని 10నిమిషాలు కనిపించకుండా ఆ అధికారి ఎక్కడికో వెళ్లాడు.

10నిమిషాల అనంతరం తిరిగొచ్చిన ఆ అధికారి చాలా రూడ్ డా,ఆవేశంగా మాట్లాడాడు. నాతో రండి అంటూ పెద్దగా అరిచాడు. నాతో అలా మాట్లాడవద్దని నేను చెప్పాను, ఆపై డిపార్టీ సెల్ గా గుర్తించబడిన చుట్టుముట్టబడిన ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అతను నన్ను కూర్చోమని ఆదేశించాడు. నేను నిరాకరించాను. వారు ఏమి చేయవచ్చో, వారు నన్ను ఎక్కడికి తీసుకెళ్లవచ్చు అనేది నాకు తెలియదు. ప్రజలు నన్ను చూడాలని నేను కోరుకున్నాను అని ఎంపీ డెబ్బీ అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు.

అదే సమయంలో వీసా ఆన్ అరైవల్ ఉంటే ఇవ్వండని కూడా తాను విజ్ఞప్తి చేసినట్లు డెబ్బీ అబ్రహామ్స్ చెప్పారు. అయితే తనకు ఎవ్వరూ ఎలాంటి సమాధనం చెప్పలేదని డెబ్బీ తెలిపారు. తనకు ఘోర అవమానం జరిగిందని, తనను భారత్‌లో క్రిమినల్‌లా చూశారనే భావనతోనే తిరిగి వెళుతున్నట్లు డెబ్బీ చెప్పారు.

2011 నుంచి అబ్రహామ్స్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. తన వ్యక్తిగత పర్యటనపై రెండురోజులు ఉండేలా భారత్‌కు వచ్చారు. గతేడాది ఆగష్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో అబ్రహామ్స్ ఒకరు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల యొక్క నమ్మకానికి తూట్లు పొడిచిందంటూ ఆమె యూకేలో భారత హైకమిషనర్‌కు లేఖ రాశారు. మరోవైపు గతవారం భారత ప్రభుత్వం 25 మంది విదేశీ దౌత్యాధికారులను కశ్మీర్ పర్యటనకు తీసుకెళ్లింది. గత ఆరు నెలల్లో ఇది రెండో పర్యటన కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి మరింత సాధారణం కావడంతో ఇలాంటి సందర్శనలు ఎక్కువగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది.