ట్రంప్ కు సమోసా,రోటీలు తినిపించనున్న మోడీ

కుటుంబ సమేతంగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కేవలం కేవలం నాలు గంటలు మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు తలిపాయి. అయితే అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఖమాన్,మల్టీగ్రెయిన్ రోటీస్,బ్రకోలి కార్న్‌తో చేసిన సమోసా వంటి రుచికరమైన గుజరాతీ వంటకాలను ట్రంప్ దంపతులు రుచిచూడనున్నారు. గుజరాత్‌లో సర్వ సాధారణంగా కనిపించే కొన్ని రకాల వంటకాలు, నాలుగైదు రుచుల టీని ఆయన మెనూలో చేర్చారు.
గుజరాత్‌లో టాప్ హోటల్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న ఫార్చూన్ ల్యాండ్‌మార్క్ హోటల్ చీఫ్ చెఫ్ సురేష్ ఖన్నా సారథ్యంలో ఈ వంటకాలు రూపొందబోతున్నాయి. ట్రంప్, మెలానియా ట్రంప్ కోసం సిద్ధం చేయాల్సిన వంటకాలం కోసం సురేష్ ఖన్నా ఆదివారం రిహార్సల్స్‌ను నిర్వహించారు. బ్రకోలి కార్న్‌తో చేసిన సమోసా, ఐస్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, కొబ్బరి నీళ్లు, మల్టీ గ్రెయిన్‌తో తయారు చేసిన బిస్కెట్లను ట్రంప్ దంపతులకు స్నాక్స్‌గా అందించనున్నారు.
అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ తన పర్యటన సందర్భంగా సందర్శించనున్న విషయం తెలిసిందే. గుజరాతీ శైలి ఆహారాన్ని ఆయనకు అక్కడే అందిస్తారు. దీనికోసం సురేష్ ఖన్నా సారథ్యంలో ఫార్చూన్ ల్యాండ్‌మార్క్ హోటల్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని రప్పించారు. ప్రత్యేకంగా ఓ వంటగదిని కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది.