BS Rao
BS Rao – Sri Chaitanya: శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. ఆయన అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ (Hyderabad) లోని అపోలో హాస్పిటల్ నుంచి విజయవాడకు తరలిస్తారు.
బీఎస్ రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బీఎస్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మొదట విదేశాల్లో బీఎస్ రావు వైద్యుడిగా 16 ఏళ్లు సేవలు అందించారు. అనంతరం, తన భార్య డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి భారత్ వచ్చారు. శ్రీ చైతన్య విద్యాసంస్థను 1986లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల(Sri Chaitanya Girls Junior College)తో ప్రారంభించారు. అంచెలంచెలుగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఎదిగాయి.
హైదరాబాద్ లో 1991లో బాయ్స్ జూనియర్ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ శ్రీచైతన్య విద్యా సంస్థలను విస్తరించారు. ఇప్పుడు దాదాపు 320 జూనియర్ కళాశాలు, 322 శ్రీచైతన్య టెక్నో స్కూల్స్ ఉన్నాయి. అంతేగాక, అదనంగా 107 సీబీఎస్ఈ చైతన్య స్కూళ్లు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి.
చంద్రబాబు సంతాపం
బీఎస్ రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. విద్యారంగంలో సేవలకు బీఎస్ రావు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు.
Ashok Gajapathi Raju: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?