బడ్జెట్ 2019 : రెండేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

  • Published By: madhu ,Published On : February 1, 2019 / 05:50 AM IST
బడ్జెట్ 2019 : రెండేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

Updated On : February 1, 2019 / 5:50 AM IST

ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారని..ఆయన స్థానంలో ఇన్ చార్జీ మంత్రి హోదాలో తాను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే గాకుండా…దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు..కుల, మత ఉగ్రవాద రహిత దేశంగా మార్చామన్నారు. గత ఐదేళ్లలో భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్న పీయూష్ వరల్డ్‌లో వేగంగా అభివృద్ధి చెందున్న ఆర్థిక వ్యవస్థ తమదేనన్నారు. 

* రైతుల ఆదాయాన్ని 2020 వరకు రెట్టింపు చేస్తాం. 
* వృద్ధి రేటులో 11వ స్థానంలో ఉన్న భారత్ నేడు 6వ స్థానంలోకి చేరుకుంది. 
* గత నాలుగున్నరేళ్లలో ద్రవ్యోల్బణం సగటు 4.6 శాతం. 
* ద్రవ్యోల్బణంను అదుపు చేయకపోతే 40 శాతం వరకు అధికంగా ప్రజలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 
* 6 ఏళ్ల క్రితం 5.6 శాతం ఉన్న ద్రవ్యలోటును ఈ సంవత్సరం 2.6 శాతానికి నియంత్రించాం. 
* విదేశీ ప్రత్యక్ష పెట్టబడుల విలువ 239 బిలయన్ డాలర్లు.
* మోడీ హయాంలో రూ. 52 లక్షల కోట్ల రుణాల మంజూరు. 

* రేరా చట్టం ద్వారా బినామీలను లావాదేవీలను నిరోధించాం. 
* బ్యాంకులకు రూ. 2.5 లక్షల కోట్ల మూలధనం. 
* ఐబీసీ ద్వారా రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలు రాబట్టాం. 
* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. 
* 15 లక్షల 20 వేల గ్రామాలకు పక్కా రహదారుల సౌకర్యం.
* ప్రధాన మంత్రి సడక్ యోజన్లకు రూ. 19వేల కోట్లు. 
* ఆయుష్మాన్ ద్వారా 50 కోట్ల పేదలకు ఉచిత వైద్యం. 
* ఇప్పటి వరకు రూ. 3వేల కోట్లు పేదల దనం ఆదా. 

* ఎన్నో రాష్ట్రాలకు ఎయిమ్స్ మంజూరు. 
5 లక్షల 45 వేల గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్పు.
ఆహారభద్రతకు రూ. 1.7 లక్షల కోట్ల కేటాయింపు. 
పీఎంజీఏవై కింద 10 లక్షల రోగులకు లబ్ది. 
143 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ. దీనిద్వారా రూ. 50వేల కోట్లు ఆదా.  
దేశంలో పేదల కోసం కోటి 53 లక్షల ఇళ్ల నిర్మాణం.
హర్యానాకు ఎయిమ్స్ మంజూరు.

సౌభాగ్య పథకం ద్వారా ప్రతింటికీ ఉచిత విద్యుత్.
మార్చి 2019 కల్లా అన్ని గృహాలకు విద్యతు్ సరఫరా. 
కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం.
ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ. 
2 హెక్టార్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6వేలు ఆర్థికసాయం. 
రూ. 2 వేల చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు.