Nuh Violence : అల్లర్లు జరిగిన నుహ్‌లో బుల్డోజరు చర్య..200 గుడిసెల కూల్చివేత

హర్యానా రాష్ట్రంలోని నుహ్ అల్లర్ల ఘటన అనంతరం అక్రమంగా వెలసిన 200 గుడిసెలపై బుల్డోజర్ చర్య తీసుకున్నారు. వలసదారులు నుహ్ సమీపంలో 200 గుడిసెలు నిర్మించుకున్నారు. అల్లర్లకు గుడిసెవాసులే కారణమని చెప్పి హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శుక్రవారం ఆక్రమణలను బుల్డోజరు సాయంతో తొలగించింది....

Bulldozer action at Haryana

Nuh Violence : హర్యానా రాష్ట్రంలోని నుహ్ అల్లర్ల ఘటన అనంతరం అక్రమంగా వెలసిన 200 గుడిసెలపై బుల్డోజర్ చర్య తీసుకున్నారు. వలసదారులు నుహ్ సమీపంలో 200 గుడిసెలు నిర్మించుకున్నారు. అల్లర్లకు గుడిసెవాసులే కారణమని చెప్పి హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శుక్రవారం ఆక్రమణలను బుల్డోజరు సాయంతో తొలగించింది. (Bulldozer action near Haryana)

gukesh surpasses anand : ఇండియా టాప్ చెస్ క్రీడాకారుడిగా గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేష్…విశ్వనాథన్ ఆనంద్ రికార్డు బద్దలు

మహిళా పోలీస్ ఫోర్స్‌తో సహా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు ఈ ప్రాంతంలో 200 మందికి పైగా అక్రమ గుడిసెల నివాసాలను ధ్వంసం చేశాయి. (Nuh after clashes) హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అజిత్ బాలాజీ జోషి ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించారు. (illegal shanties razed) సంఘటనా స్థలంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) సంజీవ్ కుమార్ కూడా ఉన్నారు.

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు…12 మందికి పైగా దుకాణదారుల గల్లంతు

ఆ ప్రాంతంలోని కొందరు మహిళలు ఆక్రమణల తొలగింపు డ్రైవ్ ను నిరసించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్న బలగాలు వారిని అడ్డుకున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని అందిన సమాచారం మేర గుడిసెలను తొలగించారు.

TSRTC Bill: రాజ్‌భవన్‌లోనే ఆర్టీసీ బిల్లు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా?

విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు. ఈ హింసాకాండ గత కొన్ని రోజులుగా గురుగ్రామ్‌కు వ్యాపించింది. హర్యానాలో శుక్రవారం కూడా అలర్ట్ ప్రకటించారు. ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు.