Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు…12 మందికి పైగా దుకాణదారుల గల్లంతు

కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మందాకిని నదిలో మూడు దుకాణాలు కొట్టుకుపోయాయి....

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు…12 మందికి పైగా  దుకాణదారుల గల్లంతు

Kedarnath yatra

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మందాకిని నదిలో మూడు దుకాణాలు కొట్టుకుపోయాయి.

Gyanvapi Survey Breaking: జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం

ఈ ఘటన తర్వాత 12 మందికి పైగా దుకాణదారులు కనిపించకుండా పోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (Kedarnath yatra route) కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయి. (dozen people feared missing after landslide) గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన సంఘటన తర్వాత బృందాలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి.

Nuh Violence : నుహ్ అల్లర్ల ఎఫెక్ట్..ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు

గురువారం, శుక్రవారం మధ్య రాత్రి దాత్ పులియాలో ఈ సంఘటన జరిగింది. తప్పిపోయిన వారు దుకాణదారులుగా అనుమానిస్తున్నామని, యాత్రికులు కాదని చమోలి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వర్ చెప్పారు. వర్షాకాలంలో వరదల భయంతో కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.