Road Accident: నాగ్‌పూర్-పూణే హైవేపై ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి

మృతుల్లో ఐదుగురు ప్రయాణికులు, రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నట్లు ఓ అధికారిని వెల్లడించారు.

Road Accident: నాగ్‌పూర్-పూణే హైవేపై ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి

Road Accident

Updated On : May 23, 2023 / 11:08 AM IST

Nagpur-Pune highway Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 13 మందికి గాయాలు కావడంతో వారిని చికిత్సనిమిత్తం సింధఖేదరాజా గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు లోపల సీట్లు భారీగా దెబ్బతిన్నాయి. అద్దాలు ద్వంసమయ్యాయి.

Medak Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న కారు, నలుగురు దుర్మరణం

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్‌కు వేగంగా వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులను 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికులు బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. అయితే ప్రమాదంకు గురైన ట్రక్కు లాజిస్టిక్ సంస్థకు చెందినదిగా నివేదించబడింది.

Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలుసా?

మృతుల్లో ఐదుగురు ప్రయాణికులు, రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నట్లు ఓ అధికారిని వెల్లడించారు. ఇదిలాఉంటే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాల్లోనూ ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రక్కు, ఎస్‌యూబీ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.