×
Ad

Ratan Tata Birthday : కప్‌ సైజ్ కేక్‌..చిన్న క్యాండిల్..సింపుల్‌గా రతన్ టాటా బర్త్‌డే వేడుక

బర్త్‌డేని ఎలా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని ఊహించుకున్నారు..? చాలా చాలా సింఫుల్‌గా పుట్టిన రోజు జరుపుకొన్నారు టాటాజీ....

  • Published On : December 30, 2021 / 02:30 PM IST

Tata

Ratan Tata Celebrates Birthday : అయనొక కార్పోరేట్ రుషి, భారత పారిశ్రామిక రంగానికి బిగ్ బాస్, ఆయన కంపెనీ మార్కెట్ వేల్యూ చూస్తే కొన్ని దేశాల జీడీపీలు కూడా సరిపోవు. ఆయన కంపెనీల మార్కెట్ వేల్యూను తెలిపేందుకు సెన్సెక్స్, నిఫ్టీ తరహాలో ఒక ప్రత్యేక ఇండెక్స్ మెయిన్‌టెయిన్ చేయాలి. భారత కార్పోరేట్ సామ్రాజ్యానికి మహారాజు ఆయన. ఇంతకి ఆయన ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది.

Read More : Cyberabad Traffic : మద్యం మత్తులో ఉంటే..వారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్‌‌లు, బార్లదే బాధ్యత

భారత్ కార్పోరేట్ సామ్రాజ్యాన్ని పాలించే రతన్‌ టాటా.. ఆయన జన్మదినం. ఇంకేముంది ఫుల్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ముఖ్యమైన వారిని పిలిచుకుని అట్టహాసంగా వేడుకలు జరుపుతారని ఊహించుకుంటారు కదా. కానీ…అలా జరగలేదు. బర్త్‌డేని ఎలా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని ఊహించుకున్నారు..? చాలా చాలా సింఫుల్‌గా పుట్టిన రోజు జరుపుకొన్నారు టాటాజీ.

Read More : Paddy Farmer : ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టాలు తీరడం లేదు – ధర్మాన

28 ఏళ్ల రతన్‌ టాటా అసిస్టెంట్‌..నాయుడు. అతనొక్కడితోనే ఈసారి టాటా తన పుట్టినరోజును జరుపుకొన్నారు. అది కూడా కేవలం కప్‌ సైజ్‌ కేక్‌తోనే..! ఓ చిన్న కప్‌ కేక్ కు క్యాండిల్‌ పెట్టి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ కేక్‌ను నాయుడు టాటాకు పెట్టి బర్త్‌డే సాంగ్‌ పాడారు. అంతే అయిపోయింది..! చాలా చాలా సింఫుల్‌గా బర్త్‌డేను జరుపుకొని సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలిచారు టాటా. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యూ ఆర్ సో గ్రేట్ సార్ అంటూ..నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.