Paddy Farmer : ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టాలు తీరడం లేదు – ధర్మాన

వరిసాగుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయంలో వరిసాగు వలన లాభం లేదని.. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదని అన్నారు.

Paddy Farmer : ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టాలు తీరడం లేదు – ధర్మాన

Paddy Farmer

Paddy Farmer : వరిసాగుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయంలో వరిసాగు వలన లాభం లేదని.. ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టం తీరడం లేదని అన్నారు. అనుకూలంగా ఉంటే రొయ్యలు సాగు చేయడం మంచిదని సూచించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు.

చదవండి : Paddy Procurement : ఇండియా గేట్ ముందు బియ్యం పారబోస్తాం…కేంద్రానికి తెలంగాణ మంత్రుల అల్టిమేటం

దానికి కారణం గతంలో మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడమే అని ఆయన తెలిపారు. తలసరి ఆదాయం పెరగడానికి, మన తలరాతలు మారడానికి ఆక్వారంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశామని ధర్మాన వివరించారు.

చదవండి : Paddy Procurement: ఢిల్లీలో తేలని తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ

ఇక సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ.. మాట ఇచ్చాం కనుక సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం. కష్టమైనా సంక్షేమం కొనసాగిస్తున్నాం.సంక్షేమం వలన కరోనా ప్రజల ఆకలి కేకలు వినపడలేదు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కాలువలు, రోడ్లు అభివృద్దికి వచ్చే రెండేళ్లలో ముందుకు వెళతాం అన్నారు ధర్మాన.