Cyberabad Traffic : మద్యం మత్తులో ఉంటే..వారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్‌‌లు, బార్లదే

సైబరాబాద్ కమిషనరెట్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు రెండు వేల మంది పోలీసులతో నిఘా ఉంటుందన్నారు. పబ్ లు, బార్లలో...

Cyberabad Traffic : మద్యం మత్తులో ఉంటే..వారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్‌‌లు, బార్లదే

Restrictions

December 31 Restrictions : మద్యం మత్తులో కస్టమర్లు ఉంటే..వారిని గమ్యస్థానాలుకు చేర్చే బాధ్యత పబ్ లు, బార్లదేనని…డ్రైవర్లు/క్యాబ్ లు అందించడానికి అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. పరిమితికి మించిన మద్యం సేవించకుండా..వారిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…2021, డిసెంబర్ 30వ తేదీ గురువారం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

Read More : Paddy Farmer : ప్రభుత్వం ఎన్ని చేసినా వరి రైతుల కష్టాలు తీరడం లేదు – ధర్మాన

సైబరాబాద్ కమిషనరెట్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు రెండు వేల మంది పోలీసులతో నిఘా ఉంటుందన్నారు. పబ్ లు, బార్లలో “Designated Driver for a day”ని అందుబాటులో ఉంచాలని, లేనిపక్షంలో 185 M.V. చట్టంకింద కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు. పరిమితికి మించిన మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరోసారి హెచ్చరించారు. మొదటిసారి మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ. 10,000 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించబడుతుందన్నారు. రెండోసారి పట్టుబడిన వారికి రూ. 15, 000 జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష, మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మైనర్లు వాహనం నడపకూడదని, రూల్స్ ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 183, 184 కింద కేసు నమోదు చేస్తామన్నారు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్.

Read  More : Telangana Corona : థర్డ్ వేవ్‌‌కు సంకేతం ఇదే…అప్రమత్తంగా ఉండాలి

కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు నగర ప్రజలు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ లు విస్తరిస్తున్న క్రమంలో..పలు ఆంక్షలు, నిబంధనలు విధించింది. పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

Read More : Vangaveeti Radha Krishna : రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా టూ వీలర్.. పీఎస్‌కు తరలింపు!

డీజేలకు అనుమతి లేదు.
రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి మాత్రమే వేడుకలకు అనుమతి.
పబ్ లు, రెస్టారెంట్ల వద్ద స్థానికులను ఇబ్బంది పెట్టవద్దు.
స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు.

Read More : Election Commission: షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ప్రకటన!

ఈవెంట్లకు పరిమితికి మించి పాస్ లను ఇవ్వకూడదు.
పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు.
ఈవెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లవద్దు.
కోవిడ్ రూల్స్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.