Govt mulls Rs 30k lifetime highway pass
Lifetime Toll Pass : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఫాస్టాగ్‌కు బైబై చెప్పేయండి. అతి త్వరలో లైఫ్ టైమ్ టోల్ పాస్ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం వార్షిక, లైఫ్ టైమ్ టోల్ పాస్‌లను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తోంది.
భారత్‌లో తరచుగా హైవేపై వెళ్లే వాహనదారులు త్వరలో ఇబ్బంది లేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు హైవే ప్రయాణాన్ని మరింత భారంగా మారిన నేపథ్యంలో ఈ చొరవతో ప్రయాణికులు ఒకసారి చెల్లించి ఎక్కువ కాలం స్వేచ్ఛగా హైవేలపై వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది.
ప్రతిపాదిత టోల్ ప్లాజా పాస్‌లు: ఎలా పనిచేస్తుందంటే? :
ప్రతిపాదిత వ్యవస్థ కింద ప్రయాణికులు రూ.3వేలకి వార్షిక టోల్ పాస్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒక ఏడాది పాటు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందిలేని ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ప్రత్యామ్నాయంగా, లైఫ్ టైమ్ టోల్ పాస్ రూ.30వేలు ఒకేసారి చెల్లించవచ్చు.
ఒకసారి చెల్లిస్తే చాలు.. 15 ఏళ్ల వరకు ఈ టోల్ పాస్ చెల్లుతుంది. ఈ కొత్త పాస్‌లు ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థలో విలీనం అయ్యాయి. తద్వారా వినియోగదారులు ఇప్పటికే ఉన్న టోల్ వ్యవస్థ నుంచి సజావుగా మార్పులు చేసుకోవచ్చు.
ప్రస్తుతం, ప్రైవేట్ వాహనాలు మొత్తం టోల్ ఆదాయంలో 26 శాతం వాటా కలిగి ఉన్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో టోల్ బూత్‌ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రస్తుతం, హైవే వినియోగదారులు నెలవారీ టోల్ పాస్‌లను మాత్రమే పొందగలరు.
దీని ధర నెలకు రూ. 340, సంవత్సరానికి రూ. 4,080 వరకు ఉంటుంది. అయితే, ఈ నెలవారీ పాస్‌లు ఒకే టోల్ ప్లాజాకు పరిమితం అవుతాయి. ప్రతిపాదిత వార్షిక, లైఫ్‌టైమ్ పాస్‌లు సాధారణ ప్రయాణికులకు ఖర్చులను తగ్గించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ రోడ్లకు అనియంత్రిత యాక్సస్ కూడా అందిస్తాయి.
ఈ ప్రతిపాదన ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో చర్చలు చివరి దశలో ఉన్నాయి. అంతేకాకుండా, హైవే వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చడానికి ప్రభుత్వం కిలోమీటరుకు టోల్ రేటును తగ్గించే మార్గాలను కూడా అన్వేషిస్తోంది.
నేషనల్ హైవేలపై వెళ్లే వాహనదారులందరికీ ఒకేరకమైన టోల్ విధానం అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా టోల్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.