ఢిల్లీలో Taxi ఎక్కాలంటే రూ.10 వేలు !!: లాక్ డౌనా మజాకా

  • Published By: nagamani ,Published On : May 14, 2020 / 02:10 PM IST
ఢిల్లీలో Taxi ఎక్కాలంటే రూ.10 వేలు !!: లాక్ డౌనా మజాకా

Updated On : May 14, 2020 / 2:10 PM IST

లాక్ డౌన్ పనికే పంగనామం పెట్టిందీ అంటే కరోనా భయంతో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి వారి స్వస్థలాలకు వెళ్లటానికి టాక్సీ ఎక్కితే  రూ.10,000 అవుతోంది.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నోయిడా లేదా ఘజియాబాద్ వరకు ప్రయాణించడానికి రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కరోనా ప్రభావంతో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే భారతీయులకు యూసీఎస్ ఆర్టీసీ వందే భారత్ మిషన్ కింద ఇటువంటి సౌకర్యాన్ని ప్రొవైడ్ చేసింది.కరోనా భయంతో భారత్ కు తిరిగి వచ్చేసినవారికి దేశలో లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో యూపీఎస్ ఆర్టీసీ వారి కోసం ఇటువంటి సౌకర్యాన్ని కల్పించింది. 

సెడాన్లలో ప్రయాణించాలనుకుంటే రూ.10వేలు అదే ఎస్‌యూవీలో ప్రయాణించాలనుకుంటే మరో రూ.2వేలు అదనం కానున్నాయి. అంటే మొత్తం రూ.12వేలు వదులుకోవాల్సిందే. సెడాన్లలో అయితే అదనపు కిలోమీటర్ కు రూ.40 అయితే ఎస్ యూవీలో అయితే రూ.50 అవుతుంది.

కాగా..యూపీ ప్రభుత్వం ఏసీ బస్సులకు కూడా చార్జీలు పెంచింది. ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి 100 కిలోమీటర్లకు రూ.1320లు చెల్లించాలి.అదే ఏసీ లేని బస్సు అయితే రూ.1000 అవుతుంది.