×
Ad

Mukul Roy: పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు..

కోర్టు తీర్పుపై సువేంధు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విజయం అని అన్నారు. హైకోర్టు తన రాజ్యాంగపరమైన అధికారాల ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి అని సువేందు అధికారి తరపు న్యాయవాది తెలిపారు.

Mukul Roy: పార్టీ మారిన ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చింది కలకత్తా హైకోర్టు. ఆయనపై అనర్హత వేటు వేసింది. సీనియర్ రాజకీయ నాయకుడు ముకుల్ రాయల్ బీజేపీ టికెట్ పై గెలిచి తృణమూల్‌ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. తాజాగా ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ముకుల్ రాయ్ ప్రస్తుతం కృష్ణనగర్‌ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఆయనపై అనర్హత వేటు వేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే అక్కడ బైపోల్ వచ్చే ఛాన్స్ లేదు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండమే.

గెలిచిన నెల రోజులకే జంప్..

ముకుల్ రాయ్ 2021 మే లో బీజేపీ టికెట్ పై ఎమ్మెల్యే గెలుపొందారు. నెల రోజులకే తృణమూల్‌ కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో ముకుల్‌ రాయ్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత సువేందు అధికారి స్పీకర్‌ ని కోరారు. అందుకు స్పీకర్‌ అంగీకరించలేదు. దాంతో సువేందు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం స్పీకర్‌కు మరో అవకాశం కల్పించింది. అయినా స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ముకుల్‌ రాయ్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది.

కోర్టు తీర్పుపై సువేంధు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విజయం అని అన్నారు. హైకోర్టు తన రాజ్యాంగపరమైన అధికారాల ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి అని సువేందు అధికారి తరపు న్యాయవాది తెలిపారు.

“జూన్ 11, 2021 నుండి అమల్లోకి వచ్చేలా భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్, 1986 నిబంధనల ప్రకారం (ముకుల్ రాయ్) అనర్హుడిగా ప్రకటించబడ్డారు. PAC చైర్మన్ గా వేసిన నామినేషన్ సైతం రద్దు చేయబడింది” అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

ముకుల్ రాయ్ వ్యవహారంలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్.. కోర్టును ఆశ్రయించారు. ముకుల్ రాయ్‌ను అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ అంబికా రాయ్ మొదట కేసు వేశారు. సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష ప్రతినిధులు పీఏసీ అధ్యక్ష పదవిని కలిగి ఉంటారు. అయితే, బీజేపీ టికెట్‌పై ఎన్నికైన ముకుల్ రాయల్ తర్వాత టీఎంసీలో చేరినందున.. ఆయన నియామకాన్ని అంబికా రాయ్ ప్రశ్నించారు.

అనర్హత వేటు అంశంపై స్పీకర్‌కు ప్రతిపక్షం లేఖ పంపినప్పుడు.. ముకుల్ రాయ్ ఎమ్మెల్యే పదవిని తొలగించడం లేదా పీఏసీ నుండి తొలగించడం అనే ప్రశ్న లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాయ్ రాజీనామా చేయాలని వాదిస్తూ కేసు దాఖలు చేశారు. అన్ని పార్టీల వాదనలు విన్న తర్వాత కలకత్తా హైకోర్టు.. స్పీకర్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. అయితే, రాయ్‌ను ఎమ్మెల్యేగా తొలగించడానికి ఎటువంటి ఆధారం లేదని స్పీకర్ బిమాన్ బెనర్జీ 2022లో కోర్టుకు తెలిపారు.

ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్..

ఈ తీర్పుని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా పోల్చారు సువేందు అధికారి. బెంగాల్‌లోనే కాదు బహుశా దేశంలోనూ ఈ రకమైన తీర్పు ఇదే మొదటిది అని అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఈ చరిత్రాత్మక తీర్పు వెలువడిందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Also Read: బిహార్‌లో ఎన్డీఏ విజయ దుందుభి.. రాకెట్‌లా దూసుకుపోవడానికి కారణాలు ఇవే.. కొత్త ట్రెండు సృష్టించిందిగా.. ఇకపై..