వైరల్ : బాలుడిపై దాడి చేసిన పెంపుడు కుక్క వీడియో

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 05:20 AM IST
వైరల్ : బాలుడిపై దాడి చేసిన పెంపుడు కుక్క వీడియో

Updated On : January 30, 2020 / 5:20 AM IST

ఓ పెంపుడు కుక్క పిట్ బుల్ 15 ఏళ్ల బాలుడి పై దాడి చేసిన ఘటన పంజాబ్ జలంధర్ లో చోటు చేసుకుంది. ఆ బాలుడిని రక్షించటం కోసం చుట్టు ప్రక్కల వారు కుక్కను చితకబాదారు. అయినా..ఆ కుక్క..బాలుడి పిక్కను మాత్రం అసలు వదలేదు. ఘటన బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే … మంగళవారం సాయంత్రం సైకిల్ పై బాలుడు ట్యూషన్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి సమీపంలో ఉండగా ఓ కుక్క బాలుడిపై దాడి చేసింది. అతడి కాళ్ల పిక్కను పళ్లతో గట్టిగా పట్టికుంది. ఆ బాలుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. హెల్ప్..హెల్ప్  అంటూ అరిచాడు. కుక్క నుండి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. కానీ కుక్క మాత్రం వదలలేదు.

అతని అరుపులకు స్థానికులు రెస్పాండ్ అయ్యారు. కుక్కను ఎంత పక్కకు తోసినా..జరగలేదు. చివరకు ఓ వ్యక్తి కర్రతో చితకబాదాడు. అయినా..ఆ కుక్క మాత్రం బాలుడి కాలును వదలలేదు. 

తన కొడుకును రక్షించుకోవాలని తల్లి కూడా ఎంతో ప్రయత్నించింది. కుక్కను కాళ్లతో తన్నింది. కొందరు కుక్క పై నీళ్లు పోశారు. ఇలా చాలా సేపు జరిగింది. కొద్ది సేపటి తర్వాత బాలుడిని విడిచి పెట్టింది.

అయితే…బాలుడి కాలికి మాత్రం తీవ్రగాయమైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఏ ప్రమాదం లేదని తేల్చిచెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఆదిత్య తివారీ అనే వ్యక్తి..ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు.