Mahua Moitra : మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి… ఎథిక్స్ ప్యానెల్ సంచలన సూచన

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి అనర్హురాలిగా ప్రకటించాలని లోక్ సభ నైతిక విలువల కమిటీ (పార్లమెంటు ఎథిక్స్ కమిటీ) సిఫార్సు చేసింది....

Mahua Moitra, dubey

Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి అనర్హురాలిగా ప్రకటించాలని లోక్ సభ నైతిక విలువల కమిటీ (పార్లమెంటు ఎథిక్స్ కమిటీ) సిఫార్సు చేసింది. ఎథిక్స్ ప్యానెల్ ఈ అంశంపై తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికను నవంబర్ 9 (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఆమోదించనున్నారు. 500 పేజీలతో కూడిన ఎథిక్స్ కమిటీ నివేదికను ఆమోదానికి ముందే మీడియాకు లీక్ అయింది.

Also Read : బంగారం కొంటున్నారా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

ఒక నిర్ణయానికి రావడానికి ఎథిక్స్ ప్యానెల్ సభ్యుల మధ్య ఓటింగ్ జరగనుంది. లోక్‌సభలో లంచం తీసుకొని ప్రశ్నలు అడిగారనే కేసులో ఎథిక్స్ కమిటీ విచారణ కొనసాగిస్తోంది. మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. నగదు, బహుమతులకు బదులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని మధ్య లంచం మార్పిడి జరిగిందని దూబే ఆరోపించారు.

Also Read :  Instigating Elephant : పోతావ్ రా రేయ్..! ఏకంగా ఏనుగుతోనే పరాచికాలు ఆడిన పోకిరీ.. కట్ చేస్తే

మొయిత్రా, హీరానందానీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి తిరుగులేని సాక్ష్యంగా న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ లేఖను దూబే ఉదహరించారు. ఈ ఆరోపణలన్నింటినీ మహువా మొయిత్రా ఖండించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, జై అనంత్ దేహద్రాయ్‌లకు కూడా ఆమె లీగల్ నోటీసు పంపారు. మహువా మొయిత్రా, దర్శన్ హీరానందనీల మధ్య మనీ ట్రయిల్‌ను పరిశీలించాలని ఎథిక్స్ ప్యానెల్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Also Read : ENG vs NED : ఇంగ్లాండ్‌కు ఊర‌ట.. నెద‌ర్లాండ్స్ పై ఘ‌న విజ‌యం..

మరో వైపు ఎంపీ మహువా లంచం తీసుకొని ప్రశ్నలు అడిగిన వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో దర్యాప్తు జరిపించాలని యాంటీ కరప్షన్ అంబుడ్స్ మాన్ లోక్ పాల్ కోరిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చెప్పారు. తన ఫిర్యాదుపై లోక్ పాల్ సీబీఐతో విచారణ జరిపిస్తుందని ఎంపీ దూబే ఎక్స్ లో పోస్టు చేశారు. ముందు అదానీ గ్రూప్ బాగోతాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మహువా కోరారు. ‘‘సీబీఐ ముందు అదానీ 13వేల కోట్ల బొగ్గు స్కాంపై కేసు నమోదు చేయాలి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదంతో అదానీ దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు చేజిక్కించుకున్నాడు’’ అని ఎంపీ మహువా ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు