Instigating Elephant : పోతావ్ రా రేయ్..! ఏకంగా ఏనుగుతోనే పరాచికాలు ఆడిన పోకిరీ.. కట్ చేస్తే

Man Arrested For Instigating Elephant : ఏనుగు నుంచి ఆ పోకిరీ తప్పించుకున్నా.. పోలీసులు నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రస్తుతం జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెడుతున్నాడు.

Instigating Elephant : పోతావ్ రా రేయ్..! ఏకంగా ఏనుగుతోనే పరాచికాలు ఆడిన పోకిరీ.. కట్ చేస్తే

Man Arrested For Instigating Elephant (Photo : Google)

ఒడిశాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పోకిరీ రెచ్చిపోయాడు. ఏకంగా ఏనుగుతోనే ఆటలు ఆడాడు. ఏనుగుని టీజ్ చేశాడు. గజరాజు తోకని పట్టుకుని గట్టిగా లాగి దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ ఏనుగుకి చిర్రెత్తుకొచ్చింది. తనతో ఆటలు ఆడిన యువకుడిపై దాడి చేసేందుకు దూసుకొచ్చింది. అయితే ఆ యువకుడు దూరంగా పారిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఏనుగు నుంచి ఆ పోకిరీ తప్పించుకున్నా.. పోలీసులు నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రస్తుతం జైల్లో కూర్చుని ఊచలు లెక్కపెడుతున్నాడు. యువకుడు ఏనుగు తోకను పట్టుకుని గట్టిగా లాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 24ఏళ్ల యువకుడిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఏనుగు తోకను లాగి అది మనుషులపై దాడి చేసేందుకు ఉసిగొల్పాడని అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. నిందితుడు పేరు దినేశ్ సాహూ. కులద్ గ్రామవాసి. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద దినేశ్ సాహుపై కేసు నమోదు చేశారు.

Also Read : ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా? ఏకంగా భార్యలను మార్చుకుని ఎంజాయ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే

అడవి నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు పొంట పొలాల్లోకి వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అక్కడే తచ్చాడుతూ ఉంది. ఇది గమనించిన గ్రామస్తులు ఏనుగును చుట్టుముట్టారు. అందులో కొందరు తుంటరి యువకులు ఏనుగుకి దగ్గరగా వెళ్లారు. దినేశ్ సాహు గజరాజు వెనుక ఉన్నాడు. దాని తోకను పట్టుకుని గట్టిగా లాగాడు. దాంతో ఏనుగుకి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వెనక్కి తిరిగి దాడి చేసేందుకు యువకులపైకి ఊరికింది. అయితే వారు ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులు వీడియో తీశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దినేశ్ సాహు చేసిన పనిని అంతా తప్పుపడుతున్నారు. ఏనుగుతో తమాషాలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఏనుగు చేతిలో చావడం ఖాయం అన్నారు.

ఈ వీడియో ఫారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్లింది. ఇంకేముంది వాళ్లు రంగంలోకి దిగారు. ఏనుగుతో పరాచికాలు ఆడటాన్ని సీరియస్ గా తీసుకున్న ఫారెస్ట్ అధికారులు వీడియో ఆధారంగా దినేశ్ సాహుని అరెస్ట్ చేశారు. వన్య ప్రాణులతో ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఆ ఏనుగు నుంచి మీరు తప్పించుకున్నా మా చట్టాల నుంచి మాత్రం తప్పించుకోలేరు అని వార్నింగ్ ఇచ్చారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం జంతువులను హింసించడం, దాడి చేయడం నేరం. అలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు. జరిమానా వేయడం, జైలు శిక్ష విధిండచం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నేరం తీవ్రతను బట్టి 3 నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ‘వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం, అడవి జంతువులను హింసించినందుకు దోషులుగా తేలిన వారికి మూడు నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించవచ్చు’ అని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు.

Also Read : ఛీ..ఛీ.. మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్‌లో ఇదేం పాడుపని, వీడియో వైరల్