Rape On 6 Years Boy Hc Key Comments
Rape on 6 Years Boy HC Key Comments : ఆరు సంవత్సరాల బాలుడిపై జరిగిన అత్యాచారం ఘటనలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలుడికి జరిగిన ఘటన ఘోరమైనదే..కానీ కాలాన్ని వెనక్కి తిప్పి..బాలుడిపై అత్యాచారం జరుగక ముందు పరిస్థితి తిరిగి తీసుకురాలేము…కానీ మానసిక భద్రత కల్పించగలం..నష్టపరిహారం ఇవ్వగలం.. అని వ్యాఖ్యానించింది.
2020లో ఆరేళ్ల బాలుడిపై జరిగిన లైంగిక దాడి కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత బాలుడికి నేరానికి ముందునాటి పరిస్థితిని తాము తీసుకురాలేకపోయినా కచ్చితంగా మానసిక భద్రత మాత్రం కల్పించగలమని భరోసా ఇచ్చింది ధర్మాసనం. కేసును విచారించిన న్యాయస్థానం బాధిత బాలుడికి 6 లక్షల రూపాయలను తాత్కాలిక నష్టపరిహారంగా ప్రకటించింది.
రూ. 50 వేలు తాత్కాలిక నష్టపరిహారంగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా కొట్టివేసింది. బాలుడికి జరిగిన అన్యాయాన్ని పోలిస్తే రూ.50వేలు చాలా స్వల్పమని భావిస్తున్నామని పేర్కొంది. కనీసం మధ్యంతర దశలోనైనా ఈ పరిహారాన్ని పెంచి ఉంటే బాగుండేదని దర్మాసనం అభిప్రాయపడింది.
బాలుడికి జరిగిన నేరానికి ప్రాయశ్చిత్తంగా అతని ముందు జీవితాన్ని తీసుకురాలేకపోయినా కనీసం సాధ్యమైనంత వరకు ఆర్థికంగా భర్తీ చేసేలా ఉండాలని పేర్కొంది. బాలుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని కోర్టు గ్రహించిందనీ..ఈ ఘటన అతని పసి మనసుపై బలమైన ముద్ర వేసే అవకాశం ఉందని..ఆ బాలుడి న్యాయస్థానం పేర్కొంది.కానీ జరిగిన ఘోరాన్ని చెరిపేయలేకపోయినా..మానసిక భద్రత కల్పించగలమని మానవతా దృక్పథంతో వ్యాఖ్యానించింది.
జరిగిన అన్యాయాన్ని చెరిపేయలేం. గడియారాన్ని వెనక్కి తిప్పి నేరాన్ని సరిచేయలేం. ఇది సాధ్యం కాదు. కాబట్టి నేరస్థుడిని విచారించడం, అతనికి శిక్ష పడేలా చేయటం..బాథితుడికి ఆర్థిక సాయం రూపంలో బాధితుడికి మానసిక భద్రతను కల్పించడం, సాధికారతా భావాన్ని కల్పించడం మాత్రమే కోర్టు చేయగలదని స్పష్టం చేసింది. నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది.