CBI Focus: బ్యాంక్ ఫ్రాడ్‌పై సీబీఐ ఫోకస్.. ఒకే సారి వంద చోట్ల సోదాలు

బ్యాంక్‌ ఫ్రాడ్‌పై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. దేశవ్యాప్తంగా ఒకే సారి వంద ప్రాంతాల్లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ సోదాలు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో..

CBI Focus: బ్యాంక్ ఫ్రాడ్‌పై సీబీఐ ఫోకస్.. ఒకే సారి వంద చోట్ల సోదాలు

cbi-office

Updated On : March 26, 2021 / 8:50 AM IST

CBI Focus: బ్యాంక్‌ ఫ్రాడ్‌పై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. దేశవ్యాప్తంగా ఒకే సారి వంద ప్రాంతాల్లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ సోదాలు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. మొత్తం 3 వేల 700 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌కు సంబంధించిన 30 కేసులలో ఈ సోదాలు నిర్వహించింది సీబీఐ.

ఇండియన్‌ ఓవర్‌సీస్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఎస్బీఐ, IDBI, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించింది సీబీఐ..

ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు… ఇందులో బ్యాంకులను మోసం చేయడం, నిధులను పక్కదారి పట్టించడం, నకిలీ డాక్యుమెంట్లతో భారీ ఎత్తున అప్పులు తీసుకోవడం లాంటి ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది..

కొందరు లోన్లు చెల్లించకుండా పక్కా వ్యూహం ప్రకారం డిఫాల్టర్లుగా మారుతూ బ్యాంకులకు తీరని నష్టాలు తెస్తున్నట్టు బ్యాంకులు గుర్తించాయి.. దీంతో అనేక వడపోతల అనంతరం బ్యాంకులు పలు కేసులను సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నాయి.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీబీఐ ఏక కాలంలో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి.. పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి..