Bihar : ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో తేజస్వి యాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో తేజస్వి యాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది.

Bihar  : ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో తేజస్వి యాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు

CBI issues summons to Bihar Deputy CM Tejashwi Yadav

Updated On : March 11, 2023 / 12:37 PM IST

Bihar  : లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసుకు సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ ఉప CM తేజశ్వీ యాదవ్‭కు చెందిన ఢిల్లీ నివాసంలో ఎన్‭ఫోర్స్‭మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇదే స్కామ్ విషయంలో తేజస్వి యాదవ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. తేజస్వి తల్లిదండ్రులైన బీహార్ మాజీ సీఎంలు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను ఇప్పటికే బీహార్ రాజధాని పాట్నాలో విచారించిన సీబీఐ అధికారులు…అతి తక్కువ వ్యవధిలోనే తేజస్వికి కూడా సమన్లు జారీ చేయటం గమనించాల్సిన విషయం.

తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయటం ఇది రెండవసారి. ఫిబ్రవరి 4న ఆయనకు తొలిసారి సమన్లు జారీ చేసి మార్చి4న విచారణకు రావాలని ఆదేశించారు. కానీ తేజస్వి యాదవ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సీబీఐ మరోసారి శనివారం (మార్చి 11,2023) తేజస్వికి మరోసారి సమన్లు జారీ చేశారు.

2022 మే నెలలో సీబీఐ వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. యాదవ్ కుటుంబానికి వారి అనుచరుల కుటుంబాలకు బహుమతిగా లేదా తక్కువ ధరకు వ్యవసాయ భూములు ఇచ్చి 12 మంది రైల్వే శాఖలో ఉద్యోగాలను పొందినట్టు సీబీఐ పేర్కొంది. 2004 నుంచి 2009 మధ్యలో లాలు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.