నేడే 10వ తరగతి ఫలితాలు విడుదల

  • Publish Date - May 5, 2019 / 01:33 AM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు ఇవాళ(05 మే 2019) విడుదల అవనున్నట్లు తెలుస్తుంది. ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నుంచీ మార్చి 29 వరకు CBSE 10వ తరగతి పరీక్షలు జరగగా దేశవ్యాప్తంగా ఈ పరిక్షలకు 27లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయగా.. ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు cbseresults.nic.in లేదా cbse.nic.in లలో చూడవచ్చు. ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలవగా అందులో 83.4% శాతం మంది పాసయ్యారు.

మొత్తం 13 లక్షల మంది CBSE పన్నెండో తరగతి పరీక్షలు రాశారు. 10, 12 తరగతులకు మొత్తం 31,14,821 మంది నమోదు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, అదే రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 499/500 మార్కులతో 12వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచారు. గతేడాది CBSE 10వ తరగతి పరిక్షల్లో 86.70 శాతం మంది విద్యార్ధులు పాసయ్యారు.