Bipin Rawat : ఆ హెచ్చరిక చేసిన మరుసటి రోజే ఘోరం.. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దుర్మరణం

తమిళనాడు కానూరులో బుధవారం(డిసెంబర్ 8,2021) మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దేశ మొదటి త్రివిధ దళాధిపతి(సీడీఎస్ జనరల్) బిపిన్ రావత్ కన్నుమూశారు. భారత వాయుసేనకు చెందిన ఎం

Bipin Rawat : తమిళనాడు కూనూరులో బుధవారం(డిసెంబర్ 8,2021) మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దేశ మొదటి త్రివిధ దళాధిపతి(సీడీఎస్ జనరల్) బిపిన్ రావత్ కన్నుమూశారు. భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17-వి5 రకం హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హెలికాప్టర్ లో మొత్తం 14మంది ఉండగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.

Bipin Rawat : నాడు మృత్యుంజయుడు.. స్వల్పగాయాలతో బయటపడ్డ బిపిన్ రావత్

కాగా, బయోవార్ ముప్పు గురించి హెచ్చరించిన మరుసటి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దుర్మరణం చెందారు. మంగళవారం(డిసెంబర్ 7,2021) బిమ్స్ టెక్ దేశాల కార్యక్రమంలో రావత్ పాల్గొన్నారు. కరోనా కారణంగా ప్రపంచం ప్రమాదంలో పడిందన్నారు. రాబోయే రోజుల్లో బయో వార్ ముప్పు ఉందంటూ హెచ్చరించారు. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని దేశాలకు పిలుపునిచ్చారు. తెల్లారే సరికి ఆయన మరణించడం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది.

CDS(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, ఆర్మీ ఉన్నతాధికారులు తమిళనాడులోని వెల్లింగ్టన్ మిలటరీ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరారు. సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ల్యాండ్ అయ్యాక Mi-17-V5 ఆర్మీ ట్రాన్స్ పోర్టు హెలికాప్టర్ లో వెల్లింగ్టన్ బయలుదేరారు. మార్గమధ్యలో కూనూరు దగ్గర ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోయింది. మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Varun Singh : అంతటి ఘోర ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలోనూ.. ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు

వాయుసేన, ఆర్మీ, నౌకదళ.. ఈ మూడింటికి చీఫ్ గా త్రివిధ దళాధిపతి(సీడీఎస్) ఉంటారని భారత ప్రభుత్వం 2019లో ప్రకటించింది. తొలి త్రివిధ దళాధిపతిగా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2022 జనవరితో ముగియనుంది. మిలటరీ వ్యవహారాలన్నీ సీడీఎస్ చూసుకుంటారు. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలటరీ అడ్వైజర్ గా వ్యవహరిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్మీ చీఫ్ స్థాయికి చేరుకున్న రావత్.. మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్ గా వ్యవహరించారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా 2020 జనవరి 1 పదవీ బాధ్యతలు తీసుకున్నారు.

Mi-17V5 Chopper Crash : బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ భద్రతపై అనుమానాలు!

MI-17V-5 హెలికాప్టర్ ప్రత్యేకతలు..
* MI-17V-5 రవాణ హెలికాప్టర్ ను రష్యా(కాజన్ హెలికాప్టర్స్) తయారు చేసింది
* ప్రపంచంలోనే ఆధునిక రవాణ హెలికాప్టర్ గా పేరు
* ఇందులో మొత్తం ముగ్గురు సిబ్బందితో కలిసి 39మంది ప్రయాణించొచ్చు
* ఇందులో FLIR సిస్టమ్ తో పాటు ఎమర్జెన్సీ ఫ్లోటేషన్ సిస్టమ్స్ ఉన్నాయి
* 4వేల 500 కిలోల బరువును మోసుకెళ్లగలదు
* S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలను కలిగుంది.

ట్రెండింగ్ వార్తలు