Varun Singh : అంతటి ఘోర ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలోనూ.. ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు

తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్-త్రివిధ దళాధిపతి) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13మంది మరణించారు.

Varun Singh : అంతటి ఘోర ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలోనూ.. ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు

Varun Singh

Varun Singh : తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్-త్రివిధ దళాధిపతి) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13మంది మరణించారు. హెలికాప్టర్ లో 14మంది ప్రయాణిస్తుండగా ప్రమాదంలో 13మంది దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

అంతటి ఘోర ప్రమాదంలోనూ బయటపడ్డ ఆ ఒకే ఒక్కడు.. ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. ప్రస్తుతం ఆయన మృత్యుంజయుడు. కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్ లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా, వరుణ్ సింగ్ ఈ ఏడాదే శౌర్య చక్ర పురస్కారం అందుకున్నారు. గతేడాది ఎల్ఏసీ తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఎమర్జెన్సీలో సేవ్ చేశారు. తమిళనాడు వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి(డీఎస్ఎస్‌సీ) డైరెక్టింగ్ స్టాఫ్ గా ఉన్నారు.

నీలగిరీస్ జిల్లాలోని డీఎస్ఎస్ సీకి బిపిన్ రావత్ వెళ్తున్నారు. స్టాఫ్ కోర్సు ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగం ఇవ్వాల్సి ఉంది. భార్య మధులికాతో కలిసి ఆయన బయలుదేరారు. ఉదయం 9 గంటల సమయంలో ఢిల్లీ నుంచి కే-3602 హెలికాప్టర్‌లో బయలుదేరి.. ఉదయం 11.30 గంటలకు సూలూరు వైమానిక స్థావరానికి చేరుకున్నారు.

Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..

అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్​ ఎంఐ-17వీ5 లో వెల్లింగ్టన్​కు వెళ్తుండగా.. మధ్నాహం 12.30 గంటల ప్రాంతంలో కూనూర్ ​సమీపంలో ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో భారీ శబ్దం వచ్చింది. స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 13మంది దుర్మరణం చెందారు. హెలికాప్టర్ ముక్కలైపోయింది. మంటల్లో తగలబడింది.

కూనూర్ నుంచి వెల్లింగ్టన్‌ ఆర్మీ బేస్‌కు హెలికాప్టర్ లో బయలుదేరారు. అయితే ల్యాండింగ్‌కు కొద్ది క్షణాల ముందు హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రస్తుతం బిపిన్‌ రావత్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు తొలి సీడీఎస్‌(త్రివిధ దళాధిపతి) ఆయనే. ప్రస్తుతం భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే.

లద్దాఖ్‌ సంక్షోభ సమయంలో ఆయన త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తున్నారు. మూడు దళాలు బీజింగ్‌ను సమష్టిగా ఎదుర్కొనే వ్యూహంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన ఫోర్‌స్టార్‌ జనరల్‌. 2015లో మయన్మార్ లో క్రాస్ బార్డర్ ఆపరేషన్ ను సమర్థంగా నిర్వహించడం రావత్ కెరీర్ లో విశేషంగా చెప్పాలి. ఈ మిషన్ లో భాగంగా ఎన్ఎస్సీఎన్ కే మిలిటెంట్లను మన జవాన్లు మట్టుబెట్టారు. ఈ మిషన్ తోపాటు 2016లో పాకిస్తాన్ పై చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ ప్లానింగ్ లోనూ రావత్ కీలకంగా ఉన్నారు.

Bipin Rawat : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఇవేనా..!

దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా 2020, జనవరి 1న బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. సీడీఎస్ గా నియామకం కావడానికి ముందు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ ఆర్మీకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలను నిర్వర్తించారు.