కేంద్ర బడ్జెట్ అంచనాలు : వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు

కేంద్ర బడ్జెట్ 2020 – 21 ఎలా ఉండబోతోంది ? సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటుందా ? వరాలు ప్రకటిస్తారా ? అనే ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే..బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగా పెట్టుకోవద్దని ఆర్థిక సర్వే సంకేతాలు పంపుతోంది. అయితే..కేంద్ర బడ్జెట్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
* బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపను పన్ను తగ్గింపు
* సామాజిక రంగాలకు వరాలు, కేంద్ర సంక్షేమ పథకాలకు నిధుల పెంపు
* రక్షణ, వైద్య, విద్య, వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలకు పెద్దపీట.
* మౌలిక వసతులకు భారీ పెట్టుబడులు.
* ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ప్రకటనలు.
* వినియోగదారుల డిమాండ్లు పెంపు, పెట్టుబడుల ప్రోత్సాహానికి చర్యలు.
* 2025 నాటికి ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేటాయింపులు.
* డీలాపడిన వృద్ధిరేటుకు కొత్త శక్తిని ఇవ్వడం, పన్నుల రాబడులను సుస్థిరం చేయడం.
* ద్రవ్యలోటుకు అడ్డుకట్ట వేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపర్చడం.
* పారిశ్రామిక రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకరావడం.
* గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం.
* నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం.
* దేశంలో గత డిసెంబర్ నాటికి 7.7 శాతానికి చేరిన నిరుద్యోగం.
Read More : అనురాగ్ ఠాగూర్ పూజలు..ఎర్రసంచితో వచ్చిన నిర్మల