Yoga Break
Yoga Break: కేంద్ర ప్రభుత్వ (Central Govt) కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు (employees) ఇక నుంచి యోగా బ్రేక్ (Yoga Break) (వై- బ్రేక్) తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ (Center issued orders) చేసింది. తమ బిజీ షెడ్యూల్ కారణంగా యోగా చేయలేని వారు, కార్యాలయాల్లో తమ కుర్చీల్లో కూర్చొని యోగా (Yoga) చేయొచ్చని తెలిపింది. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామం, టీ, టిఫిన్ కోసం బ్రేక్‌లు ఉండేవి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ నుకూడా తీసుకురావటంతో ఉద్యోగులుసైతం ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఈ యోగా బ్రేక్ ను తీసుకోవాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించుకుని పునరుత్తేజం పొందేందుకు వీలుగా ఆపీసు సమయంలో కుర్చీలోనే యోగా చేయాలని సూచించింది.
TamilNadu Minister Arrest :మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాడులు..తమిళనాడు మంత్రి అరెస్ట్
నిత్యం ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, ఇంటి వద్ద యోగా చేయలేని ఉరుకుల పరుగుల జీవితం. ఫలితంగా కొందరు ఉద్యోగులు మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి కొంత రిలీఫ్ పొందేందుకు, పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని పునరుత్తేజం పొందేందుకు కార్యాలయాల్లోనే కుర్చీలో యోగా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, కుర్చీల్లో కూర్చొని ఎలాంటి ఆసనాలు వేయాలనే డౌట్ కొందరు ఉద్యోగులకు రావొచ్చు. అలాంటి వారికోసం, కార్యాలయాల్లో ఎలాంటి ఆసనాలు వేసేందుకు వీలుందో తెలిపే యూట్యూబ్ వీడియోల లింక్‌లను మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో జతచేసింది.
సిబ్బంది శిక్షణ , వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన యూట్యూబ్ లిక్ లో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానానికి సంబంధించిన విధానాలు ఉంటాయని వివరించింది. వీటిని నిపుణుల సూచనలతో రూపొందించినట్లు చెప్పింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. అదేవిధంగా అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగులకోసం ఈ కొత్త యోగా ప్రొటోకాల్ ను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కోరింది. అన్ని ప్రభుత్వ శాఖలు వై-బ్రేక్ గురించి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.