Removal of Rantock and Genitock
Rantac And Genitac Removed : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ కారక ఆందోళనల నేపథ్యంలో అత్యవసర మందుల జాబితా నుంచి యాంటాసిడ్ సాల్ట్ రానిటిడైన్‌ను తొలగించింది. ఈ జాబితా నుంచి 26 మందులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసిలాక్, జినిటాక్, రాంటాక్ బ్రాండ్ల పేరుతో రానిటిడైన్‌ను ప్రముఖంగా విక్రయిస్తున్నారు. అసిడిటీ, కడుపు నొప్పి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత రోగాలకు వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు.
acidity drugs : అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడొచ్చా!…
కేంద్ర ప్రభుత్వం మంగళవారం 384 ఔషధాలతో నూతన అత్యవసర మందుల జాతీయ జాబితా (ఎన్ఎల్ఈఎం) విడుదల చేసింది. ఇక ఈ జాబితా నుంచి తొలగించిన 26 ఔషధాలు దేశంలో ఉనికిలో ఉండవు. క్యాన్సర్ కారక ఆందోళనలపై రానిటిడైన్‌ను ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్నారు. అత్యవసర మందుల జాబితా నుంచి దీనిని తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డీసీజీఐ, ఎయిమ్స్‌లతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది.
ఇక నూతన అత్యవసర మందుల జాబితా వెల్లడించడంతో ఇన్సులిన్ గ్లర్గైన్ వంటి మధుమేహ ఔషధాలు, డెలమనిడ్ వంటి టీబీ ఔషధాలు, ఐవర్‌మెక్టిన్ వంటి యాంటీపారసైట్ డ్రగ్స్ ధరలు దిగి రానున్నాయి.